Richie Gadi Pelli Trailer: స్టార్ దర్శకుడికి తెగ నచ్చేసింది

ABN , First Publish Date - 2023-02-21T21:09:53+05:30 IST

కె.ఎస్. ఫిల్మ్ వర్క్స్ (KS Film Works) బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘రిచి గాడి పెళ్లి’ (Richie Gadi Pelli).ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని

Richie Gadi Pelli Trailer: స్టార్ దర్శకుడికి తెగ నచ్చేసింది
Richie Gadi Pelli Trailer Launch

కె.ఎస్. ఫిల్మ్ వర్క్స్ (KS Film Works) బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘రిచి గాడి పెళ్లి’ (Richie Gadi Pelli).ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని కెఎస్ హేమరాజ్ (KS Hemraj) స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ప్రధాన తారాగణంగా నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమాగా అనిపిస్తుంది. ఒక చిన్న ఆట వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ సినిమా కథాంశం. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. చిత్రయూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నానని అన్నారు.

దర్శకనిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ.. ‘రిచి గాడి పెళ్లి’ అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా చిత్రాన్ని తెరకెక్కించాం. ట్రైలర్ విడుదల చేసిన హరీష్ శంకర్‌గారికి మా యూనిట్ తరపున ధన్యవాదాలు. ట్రైలర్‌కి చాలా మంచి స్పందన లభిస్తోంది. మార్చి 3వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. (Richie Gadi Pelli Trailer)

ఇవి కూడా చదవండి:

Rajendra Prasad: ఇది సంస్కారవంతమైన కేటగిరీకి చెందిన సినిమా

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Updated Date - 2023-02-21T21:10:00+05:30 IST