Harish Shankar : అదిరిపోయే జవాబిచ్చిన దర్శకుడు!

ABN , First Publish Date - 2023-11-25T15:47:53+05:30 IST

దర్శకుడు హరీష్ శంకర్  (Harish Shankar) సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తూనే, తనని ట్రోల్‌ చేసేవారికి గట్టిగా ఇచ్చి పడేస్తుంటారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్‌ భగతసింగ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Harish  Shankar : అదిరిపోయే జవాబిచ్చిన దర్శకుడు!

దర్శకుడు హరీష్ శంకర్  (Harish Shankar) సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తూనే, తనని ట్రోల్‌ చేసేవారికి గట్టిగా ఇచ్చి పడేస్తుంటారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్‌ భగతసింగ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వరల్డ్‌ కప్‌కు సంబంధించి ఆయన పోస్ట్‌లను ట్రోల్‌ చేసిన వారికి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. అంతే కాదు.. సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. "12 గంటలు విశ్రాంతి లేకుండా పని చేశాక సోషల్‌ మీడియా వైపు ఓ లుక్కేస్తా. నా పై ట్రోల్స్‌ చేేస వాళ్లు లేకపోతే నేనేమైపోతానో అనిపిస్తుంది. వాళ్ల వల్లే ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని"హరీష్ శంకర్  చెప్పారు. 'ఉస్తాద్‌ భగతసింగ్‌' Ustaad Bhagath singh) అంచనాలు అందుకుంటుందని, అందుకునేలా చేేస పూర్తి బాధ్యత తనదేనని అన్నారు.

చిరంజీవి(Chiranjeevi), రామ్‌ చరణ్‌ (Ram Charan) కాంబినేషన్‌లో సినిమా తీస్తారా? అన్న ప్రశ్నకు ''అందులో పవన్‌ కల్యాణ్‌ను కూడా యాడ్‌ చేసుకోవచ్చు’ అని క్రేజ్‌గా సమాధానమిచ్చారు హరీశ శంకర్‌.

స్ఫూర్తినిచ్చే దర్శకులు చాలామంది ఉన్నా.. శంకర్‌ సర్‌ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఈతరంలో అయితే సుకుమార్‌, సందీప్‌ వంగా దర్శకత్వం నచ్చుతుందని, త్రివిక్రమ్‌ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. థియేటర్లో సినిమాలు చూడడం మొదలుపెట్టినప్పుడే డైరెక్షన చేయాలనే కోరిక మొదలైంది. చూసిన ప్రతి సినిమాను మరో సినిమాతో పోల్చుకునేవాడినని ఆయన తెలిపారు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎవరికైనా అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు "ఎవరు ఎవరికీ సాయం చెయ్యరు తమ్ముడు. నేను డైరెక్టర్‌ అవ్వడానికంటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావడానికి చాలా తిప్పలు పడ్డాను. ప్రతి ఒక్కరూ యుద్థం చేయాల్సిందే. గెలవాల్సిందే.

Updated Date - 2023-11-25T15:47:56+05:30 IST