సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Balagam Mogilaya: మొగిలయ్య కష్టానికి స్పందించిన మంత్రి!

ABN, First Publish Date - 2023-03-30T18:52:36+05:30

బలగం’ చిత్రం క్లైమాక్స్‌లో ‘తోడుగా మా తోడుంది’ పాట ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే! సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి హృదయం ద్రవించేలా చేసిందా పాట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బలగం’ (Balagam)చిత్రం క్లైమాక్స్‌లో ‘తోడుగా మా తోడుండి’ (Thoudga ma thodundi) పాట ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే! సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి హృదయం ద్రవించేలా చేసిందా పాట. ఆ సాంగ్‌ అంతగా పాపులర్‌ కావడానికి కారణం కొమురమ్మ(komuramma), మొగిలయ్యల (Mogilayya) గానం. బుర్రకథతో రక్తసంబంధం విలువ చాటి చెప్పేలా గొంతెత్తి ఆలపించి ప్రేక్షకుల్ని కన్నీటి పర్యాంతమయ్యేలా చేశారు. ప్రస్తుతం ఆ దంపతులు కూడా కన్నీటితో సావాసం చేస్తున్నారు.

మొగిలయ్య రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా డయాలసిస్‌ నడుస్తున్నా.. ప్రస్తుతం అందుకు ఆయన శరీరం సహకరించడం లేదు. ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశారు. అందులో ఆరు లక్షలవారు అప్పే. ప్రస్తుతం వారి ఆర్థిక పరిస్థితి దీనంగా ఉండడంతో అది గమనించిన ‘బలగం’ దర్శకుడు వేణు స్పందించి రూ. లక్ష సాయం అందించారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు కూడా మొగిలయ్య పరిస్థితి తెలుసుకుని స్పందించి మొగిలయ్యకు అండగా (Harish Rao reacts to 'Balagam' Mogilaya's illness) ఉంటానన్నారు. మొగిలయ్యను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లి అన్నిరకాల పరీక్షలు చేసి అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఆయనకు డయాలసిస్‌తో పాటు మెరుగైన వైద్యం అందించి, మందులు ఇవ్వాలని అన్నారు.

Updated Date - 2023-03-30T19:12:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!