కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HariHara Veeramallu : ఆలస్యమైనా విడుదల మాత్రం అలాగే..!

ABN, First Publish Date - 2023-10-07T14:10:36+05:30

'బాహుబలి’ చిత్రంతో భారీ చిత్రాలు రెండు పార్టులుగా విడుదల చేసే వరవడి మొదలైంది.పాన ఇండియా స్థాయిలో విడుదలయ్యే ప్రతి చిత్రం రెండు భాగాలుగానే తెరకెక్కుతున్నాయి. మేకర్స్‌ కూడా ఆ దిశగానే ఆసక్తి చూపిస్తున్నారు.

'బాహుబలి’ చిత్రంతో భారీ చిత్రాలు రెండు పార్టులుగా విడుదల చేసే వరవడి మొదలైంది.పాన ఇండియా స్థాయిలో విడుదలయ్యే ప్రతి చిత్రం రెండు (pawan kalyan) భాగాలుగానే తెరకెక్కుతున్నాయి. మేకర్స్‌ కూడా ఆ దిశగానే ఆసక్తి చూపిస్తున్నారు. 'బాహుబలి’ తర్వాత యష్ , ప్రశాంత నీల్‌ కాంబినేషన్ లో వచ్చిన 'కేజీఎఫ్‌’ రెండు భాగాలుగా విడుదలై సంచలన విజయం అందుకుంది. అల్లు అర్జున 'పుష్ప-2 సిద్ధమవుతోంది. ప్రభాస్‌ 'సలార్‌’ కూడా రెండు పార్టులుగా విడుదల కానుంది. ఎన్టీఆర్‌ నటిస్తున్న 'దేవర’ కూడా రెండు భాగాలుగా వస్తోందని దర్శకుడు కొరటాల శివ ఇటీవల వెల్లడించారు. (harihara veeramallu)

ఈ మధ్యకాలంలో మొదలుపెట్టిన భారీ చిత్రాలన్నీ రెండు భాగాలుగానే రానున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు’ చిత్రం కూడా రెండు భాగాలుగా రానుందని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు క్రిష్‌ కూడా ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో  పవన్ కళ్యాణ్ సరసన నిధీ అగర్వాల్‌ కథనాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్‌, విక్రమ్‌జిత విర్క్‌, నోరా ఫతేహి కీలక పాత్రధారులు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఎంరత్నం నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్‌ భగతసింగ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క వారాహి విజయయాత్ర కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-10-07T15:22:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!