Happy Birthday Kamal Haasan: కమల్ హాసన్ ఆస్తి విలువ తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2023-11-07T12:58:14+05:30 IST

ఈరోజు కమల్ హాసన్ పుట్టినరోజు, ఈ సందర్భంగా కమల్ హాసన్ చేస్తున్న సినిమాలు, అతని ఆస్తి విలువ ఎంత ఉంటుంది, లండన్ లో అతని ఇల్లు, ఖరీదైన కార్లు, వ్యవసాయ భూమి ఇంకా చాలా విషయాలు అతని గురించి.

Happy Birthday Kamal Haasan: కమల్ హాసన్ ఆస్తి విలువ తెలిస్తే షాకవుతారు!
Happy birthday Kamal Haasan

భారతీయ చిత్ర పరిశ్రమలో వున్న గొప్ప నటుల్లో కమల్ హాసన్ (KamalHaasan) ఒకరు. మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన నటనతో ఎంతోమందిని మెప్పిస్తూ, ఈరోజు ప్రపంచం అంతటా అభిమానులని సొంతం చేసుకున్న నటుడు కమల్ హాసన్ (Happy Birthday Kamal Haasan). తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 220 సినిమాలలో వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన కమల్ హాసన్ పుట్టినరోజు ఈరోజు.

69 ఏళ్ళ కమల్ హాసన్ కి వయసుతో సంబంధం లేదు, ఎందుకంటే అతను చిన్న వయసులో ముసలి పాత్రలు అద్భుతంగా పోషించాడు, అలాగే 60 ఏళ్ల వయసులో ఒక కుర్రాడి పాత్ర కూడా పోషించాడు. ఎన్నో ప్రయోగాలు చేసిన నటుడు కమల్ హాసన్. (Happy Birthday Kamal Haasan) 'అపూర్వసహోదరులు' సినిమాలో మరుగుజ్జు మనిషిగా, 'దశావతారం' లో పది పాత్రలు వేసి, 'మైకేల్ మధన కామరాజు' లో మూడు పాత్రల్లో, 'సాగర సంగమం' లో ఒక క్లాసికల్ డాన్సర్ గా, 'స్వాతి ముత్యం' లో ఏమీ తెలియని అమాయకుడిలా 'ఇంద్రుడు చంద్రుడు' లో ఒక విధమైన మేయర్ పాత్రలో, ఇలా ఒకటేమిటి ఎన్నో పాత్రలో మెప్పించిన గొప్ప నటుడు కమల్ హాసన్.

kamalhaasanstillbharatheeyu.jpg

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కమల్ హాసన్ సినిమాలు పక్కన పెడితే, అతని ఆస్తి విలువ తెలిస్తే (Happy Birthday Kamal Haasan) షాకవుతారు. ఈమధ్యనే 'విక్రమ్' #Vikram సినిమాతో తన అప్పులు తీరాయని చెప్పిన కమల్ హాసన్ ఆస్తి సుమారు రూ.150 కోట్ల పై మాటే అని అంటున్నారు. ఆ సినిమా విజయం తరువాత అతను తన పారితోషికాన్ని కూడా బాగా పెంచేశారు అని వార్త. అలాగే ఇప్పుడు 'భారతీయుడు 2', 'కల్కి 2898AD' #Kalki2898AD, దర్శకుడు మణిరత్నంతో (ManiRatnam) ఒక సినిమా, అలాగే ఇంకో దర్శకుడు హెచ్ వినోద్ (HVinoth) తో కూడా ఒక సినిమా వుంది.

కమల్ హాసన్ ఆస్తి వివరాలు

130 కోట్ల ప్రాపర్టీస్

2022 లో ప్రభుత్వానికి అధికారికంగా కమల్ హాసన్ చెప్పిన లెక్కల ప్రకారం అతనికి రూ. 130 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరమైన ఆస్తులు (immovable properties) ఉన్నాయని చెప్పారు. అందులోనే 17 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని, అది రూ.17 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిపారు.

birthdayboykamalhaasanwithh.jpg

చెన్నైలో అపార్టుమెంట్

స్థిరాస్తులు కాకుండా కమల్ హాసన్ కి చెన్నైలో రెండు అపార్టుమెంట్స్ వున్నాయి. ఈ రెండు అపార్టుమెంటుల విలువ కలిపి సుమారు రూ.19.5 కోట్లు ఉంటుంది అని చెప్పారు. ఇవి తమిళ నాడు రాష్ట్ర రాజధాని చెన్నై లో వున్నాయి. ఈ రెండు అపార్టుమెంట్లు కాకుండా కమల్ హాసన్ కి చెన్నైలో ఇంకా వ్యాపార నిమిత్తం కమెర్షియల్ కాంప్లెక్స్ కట్టి అద్దెకి ఇచ్చారని, అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా డబ్బులు పెట్టారని తెలిసిందే. మొత్తం వీటన్నిటి విలువ కలిపితే సుమారు రూ.92.5 కోట్లు ఉంటుందని అంచనా.

kamalhaasanproperty.jpg

లండన్ లో ఒక ఇల్లు

ఇండియాలోనే కాకుండా కమల్ హాసన్ విదేశాల్లో కూడా పెట్టుబడి పెట్టారని తెలిసింది. చెన్నైలో వున్న ఈ స్థిరాస్తులు, వ్యవసాయ భూమి, ఇళ్ళు కాకుండా కమల్ హాసన్ బ్రిటన్ రాజధాని లండన్ లో కూడా ఒక ఇల్లు తన పేరుమీద కొని పెట్టుకున్నారని తెలిసింది. ఈ ఇంటి విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని అంచనా. కమల్ హాసన్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రకటనలో ఈ ఇంటి గురించి కూడా వివరాలు ఉన్నాయని తెలిసింది. (Happy Birthday Kamal Haasan)

ఖరీదైన కార్లు

ఇక కమల్ హాసన్ కార్లు కూడా చాలా ఖరీదైనవి వాడతారు. అతనికి ఒక బిఎండబ్ల్యూ 730 ఎల్ డి (BMW 730LD), లెక్సస్ ఎల్ఎస్ 570 (Lexus Ls 570) కార్లు వున్నాయి. ఈ రెండు కార్ల విలువ కలిపి రూ. 3.69 కోట్లు ఉంటుంది. ఇక అతని దగ్గర టొయోటా ప్రాడో (Toyoto Prado), మిత్సుబిషి పాజెరో (Mitsubishi Pajero), మెర్సిడెస్ బెంజ్ ఏ 220 (Mercedes Benz E 220), హమ్మర్ హెచ్3 (hummer H3) (రూ.80 లక్షలు), రేంజ్ రోవర్ ఎవాక్యూ (రూ.60 లక్షలు) (Range Rover Evoque), ఆడి ఎ8 ఎల్ (Audi A8 L) (రూ.1.19 కోట్లు) వున్నాయి. ఇంకా ఇవన్నీ ఎంత ఖరీదైనవో మీరే ఊహించుకోండి.

kamalhaasanprivatejet.jpg

స్థిరాస్తులు, కారులు, ఇళ్ళు, వ్యవసాయ భూమి మొత్తం అన్నీ కలిపితే అతను ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం అతని ఆస్తి విలువ రూ.177 కోట్లు అని చూపించాడు. ఇప్పుడు అతను శంకర్ (ShankarShanmugham) దర్శకత్వంలో 'భారతీయుడు 2' #Bharateeyudu2 సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు అయిపోవచ్చింది. ఇక మణిరత్నంతో ఒక సినిమా, హెచ్ వినోద్ తో ఒక సినిమా, నాగ్ అశ్విన్ (NagAshwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'కల్కి 2898ఏడి' #Kalki2898AD సినిమాలో కూడా నటిస్తున్నారు.

Updated Date - 2023-11-07T13:13:52+05:30 IST