Hansika Motwani: హార్మోన్ ఇంజక్షన్స్ రూమర్స్‌పై క్లారిటీ.. అదే నిజమైతే టాటా, బిర్లా కన్నా ధనవంతురాలిగా..

ABN , First Publish Date - 2023-02-18T16:18:39+05:30 IST

బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ఆమె వెడ్డింగ్ వీడియో తాజాగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది. ‘లవ్‌ షాదీ డ్రామా’ (Love Shaadi Drama) టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది.

Hansika Motwani: హార్మోన్ ఇంజక్షన్స్ రూమర్స్‌పై క్లారిటీ.. అదే నిజమైతే టాటా, బిర్లా కన్నా ధనవంతురాలిగా..

బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ఆమె వెడ్డింగ్ వీడియో తాజాగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది. ‘లవ్‌ షాదీ డ్రామా’ (Love Shaadi Drama) టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెడ్డింగ్ వీడియోలో కొత్త ఎపిసోడ్‌ విడుదల అయింది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా హన్సిక అనేక విషయాలపై మాట్లాడారు. గతంలో తాను హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకున్నాననే రూమర్స్‌పై ఆమె స్పందించారు.

హన్సిక మోత్వానీ బాల నటిగా అనేక సినిమాల్లో నటించారు. ‘షక లక బూమ్ బూమ్’, ‘కోయి మిల్ గయా’ వంటి చిత్రాల్లో కనిపించారు. బాల్యనటిగా కెరీర్ ఆరంభించిన కొన్నాళ్లకే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారు. హన్సిక త్వరగా పెరిగేందుకు ఆమె తల్లి హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చిందనే రూమర్స్ ఆ సమయంలో హల్‌చల్ చేశాయి. తాజాగా హన్సిక ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను ఎనిమిదేళ్లున్నప్పుడే బాల్యనటిగా ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్‌గా మారగానే త్వరగా పెరగడానికి హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకున్నానని ప్రతి ఒక్కరు అన్నారు. నేను 21ఏళ్లున్నప్పుడు ఈ విధమైన చెత్త వార్తలను రాశారు. ఆ రూమర్స్ ఒకవేళ నిజమైతే టాటా, బిర్లా కన్న ధనవంతురాలిగా మారేదానిని. ఇటువంటి వార్తలు రాసేవారికి కామన్ సెన్స్ లేదు. మేం పంజాబీలం. 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య త్వరగా పెరుగుతాం. సెలబ్రిటీగా ఉన్నందుకు నేను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’’ అని హన్సిక తెలిపారు.

హన్సిక ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆమె వెడ్డింగ్ వీడియో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్కో ఎపోసోడ్‌లో తన జీవితంలోని ఆసక్తికర విషయాలను హన్సిక అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

Updated Date - 2023-02-18T16:18:40+05:30 IST