మాస్టారు.. మాస్టారు.. తర్వాత మరోసారి!

ABN , First Publish Date - 2023-05-11T15:59:27+05:30 IST

పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) హీరోగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని(PVT04) రూపొందిస్తున్న సంగతి లిసిందే! శ్రీలీలా(Srileela), జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌ నాయికలు.

మాస్టారు.. మాస్టారు.. తర్వాత మరోసారి!

పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) హీరోగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని(PVT04) రూపొందిస్తున్న సంగతి లిసిందే! శ్రీలీలా(Srileela), జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌ నాయికలు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్‌ సమర్పిస్తోంది. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న వైష్ణవ్‌కు ఈ చిత్రం విభిన్నంగా ఉంటుంటి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. మునుపెన్నడూ చూడని పాత్రలో వైష్ణవ్‌ను చూడబోతున్నామని సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియో చిత్ర బృందం పేర్కొన్నారు. ఇప్పుడు ఈ సినిమాని నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లడానికి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ (Gv Prakash kumar) రంగంలో దిగాడు. ఈ విషయాన్ని సితారా సంస్థ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. ఇదే బ్యానర్‌లో ధనుష్‌ హీరోగా నటించిన ‘సార్‌’తో మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్‌ను అందించారు జి.వి. ప్రకాష్‌ కుమార్‌. ఈ ఆల్బమ్‌ కచ్చితంగా మరో పెద్ద చార్ట్‌బస్టర్‌ కానుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. త్వరలో గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పంజా వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రెండో చిత్రం ‘కొండపొలం’, మూడో చిత్రం ‘రంగరంగ వైభవంగా’ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆయన దృష్టంతా ఈ చిత్రం మీదే ఉంది.

Updated Date - 2023-05-11T15:59:27+05:30 IST