Sukumar: శిష్యుడికి పెద్ద గిఫ్ట్ ఇచ్చిన గురువుగారు

ABN , First Publish Date - 2023-06-28T10:47:38+05:30 IST

తన శిష్యులకు ముందుండి నడిపించడమే కాకుండా, వారు తీసిన సినిమాల విజయాల తరువాత వారికి ఆశ్చర్యపరిచే విధంగా వారికి కానుకలు కూడా ఇచ్చి ప్రోత్సహించే గురువు బహుశా సుకుమార్ ఒక్కడేనేమో

Sukumar: శిష్యుడికి పెద్ద గిఫ్ట్ ఇచ్చిన గురువుగారు
Virupaksha director Karthik Dandu and Sukumar

ఈమధ్య చాలామంది కొత్త దర్శకులు కొత్త పాయింట్స్ తో వచ్చి విజయం సాధిస్తున్నారు. అందులో దర్శకుడు కార్తీక్ దండు (KarthikDandu) కూడా వున్నాడు. అతను దర్శకత్వం వహించిన 'విరూపాక్ష' #Virupaksha సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుకుమార్ (Sukumar) శిష్యుడే ఈ కార్తిక్ దండు. సుకుమార్ 'విరూపాక్ష' కి నిర్మాతల్లో ఒకడు కాగా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇతనొక్కడే కాదు, ఇంతకు ముందు సానా బుచ్చిబాబు (BuchibabuSana) 'ఉప్పెన' (Uppena) తో, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) 'దసరా' (Dasara) సినిమాతో హిట్స్ ఇచ్చారు, వీరిద్దరూ కూడా సుకుమార్ శిష్యులే.

sukumar3.jpg

ఇలా శిష్యులను బాగా ముందుండి నడిపించడమే కాకుండా, ఇలా విజయాసలు సాధిస్తున్న దర్శక శిష్యులకి సుకుమార్ తనదైన స్టైల్ లో కానుకలు కూడా ఇస్తున్నాడు. నిన్న 'విరూపాక్ష' దర్శకుడు కార్తిక్ దండుకి బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును కానుకగా ఇచ్చాడు నిర్మాతల్లో ఒకరైన సుకుమార్. ఇదే విషయాన్ని, దర్శకుడు కార్తిక్ తన సాంఘీక మాధ్యమాల్లో పెట్టి గురువుగారు అయిన సుకుమార్ కి థేంక్స్ చెప్పాడు.

'విరూపాక్ష' జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అయితే, దానితో పాటు మంచి కానుక ఇచ్చిన నా గురువు సుకుమార్ సార్, మా హీరో సాయి ధరమ్ తేజ్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు, అంటూ ఒక ట్వీస్ట్ పోస్ట్ చేసి ఈ కారుతో వున్న ఫోటోస్ కూడా పోస్ట్ చేసాడు.

'విరూపాక్ష' సినిమా విడుదల అయిన మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ తో వెళ్లి, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలించింది. ఇందులో సంయుక్త మీనన్ (Samyuktha) కథానాయిక కాగా, సోనియా సింగ్ (SoniaSingh), రవి కృష్ణ, బ్రహ్మాజీ (Brahmaji), సాయిచంద్ ఇలా చాలామంది ఆర్టిస్టులు వున్నారు.

Updated Date - 2023-06-28T10:47:38+05:30 IST