Guntur Karam: 'కుర్చీ మడతపెట్టి’ పాట వచ్చేసింది... థియేటర్స్‌ దద్దరిల్లిపోతాయ్‌...

ABN , Publish Date - Dec 30 , 2023 | 07:56 PM

మహేష్‌బాబు (Mahesh babu) హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్  పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur karam). మహేష్‌, త్రివిక్రమ్‌ (trivikram)శ్రీనివాస్‌ కాంబినేషన్లో  వస్తున్న మూడో చిత్రమిది.  ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా  భారీస్థాయిలో విడుదల కానుంది.

Guntur Karam: 'కుర్చీ మడతపెట్టి’ పాట వచ్చేసింది... థియేటర్స్‌ దద్దరిల్లిపోతాయ్‌...

మహేష్‌బాబు (Maheshbabu) హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్  పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur karam). మహేష్‌, త్రివిక్రమ్‌ (trivikram)శ్రీనివాస్‌ కాంబినేషన్లో  వస్తున్న మూడో చిత్రమిది.  ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా  భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే దమ్‌ మసాలా, హే బేబీ అనే రెండు పాటలను విడుదల చేశారు. మహేష్  పక్కా మాస్‌ యాంగిల్‌లో కనిపిస్తున్నారు. దీంతో పండుగకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ ఎత్తున రమణ గాడి రుబాబు ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. తమన్  సంగీతం అందించిన ఈ చిత్రంలోని మూడో పాట హై వోల్టేజ్‌ మాస్‌ నంబర్‌ ‘కుర్చీ మడతపెట్టి’ని విడుదల చేసింది. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను మరింత మాస్‌గా, ఎనర్జిటిక్‌గా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ పాటను విడుదల చేసింది. ఈ పాటలో అదిరిపోయే బీట్‌ను, గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. రామజోగయ్య శాస్రి సాహిత్యం అందించారు. తమన సంగీతం అందించారు. 

GK-SongStill3.jpg

‘రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి’..  ‘‘తూనీగ నడుములోన తూటాలెట్టి.. తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి..’’ వంటి పదాలతో 80ల నాటి సూపర్‌స్టార్‌ కృష్ణ క్లాసిక్‌ మాస్‌ చిత్రాలను గుర్తు చేస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి నటీనటులుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మహేశ డాన్సలో మంచి ఈజ్‌తోపాటు ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ స్టెప్పులకు థియేటర్లు ఖచ్చితంగా షేక్‌ అవ్వాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Updated Date - Dec 30 , 2023 | 07:56 PM