Adivi Sesh: ‘జీ2’ అదిరే అప్‌డేట్‌!

ABN , First Publish Date - 2023-07-21T21:04:39+05:30 IST

తన తదుపరి చిత్రం ‘జీ 2’ గురించి తాజా అప్‌డేట్‌ ఇచ్చార అడివి శేష్‌. ఇదొక గేమ్‌ ఛేంజింగ్‌ సినిమా అని శేష్‌ తెలిపారు. శేష్‌ హీరోగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కించిన ‘గూఢచారి’ బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జీ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Adivi Sesh: ‘జీ2’ అదిరే అప్‌డేట్‌!

తన తదుపరి చిత్రం ‘జీ 2’(G2) గురించి తాజా అప్‌డేట్‌ ఇచ్చార అడివి శేష్‌ (Adivi Sesh). ఇదొక గేమ్‌ ఛేంజింగ్‌ సినిమా అని శేష్‌ తెలిపారు. శేష్‌ హీరోగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కించిన ‘గూఢచారి’ (Gudachari2) బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జీ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం శేష్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ చిత్రం అప్‌డేట్‌ ఇచ్చారు. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేశారు. ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు. గేమ్‌ ఛేంజింగ్‌ సినిమాను అందించేందుకు దర్శకుడు వినయ్‌ కుమార్‌ . రచయిత అబ్బూరి రవి ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ‘జీ2’ స్ర్కిప్టు భారీ స్థాయిలో ఉండనుంది. వినయ్‌ కుమార్‌ విజన్‌ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. కానీ, నేను చెప్పబోయేది ఒక్కటే.. సినిమా అదిరిపోద్ది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ఓ నెటిజన్‌ ‘గూఢచారి’ గ్లింప్స్‌ పోస్ట్‌ చేసి ‘టాలీవుడ్‌లో వచ్చిన ది బెస్ట్‌ స్పై థ్రిల్లర్స్‌లో ఇదొకటి’ అని పేర్కొన్నారు. దీనికి శేష్‌ సీక్వెల్‌పై ట్వీట్‌ పెట్టారు. ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్నాం అన్నా. ‘పార్ట్‌2’.. పార్ట్‌ 1కి మించి ఉండాలి’, ‘సినిమాటిక్‌ యూనివర్స్‌ ప్లాన్‌ చేశారా?’ అంటూ అబి?మానులు కామెంట్లు పెడుతున్నారు. ‘గూఢచారి’ కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. రెండో భాగం అంతర్జాతీయంగా జరగనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతోపాటు మరికొన్ని కొత్త పాత్రలు ‘జీ2’లో కనిపించనున్నాయి.

Updated Date - 2023-07-21T21:04:39+05:30 IST