Biggboss 7 : డ్రాగన్ బ్రీత్ ఆగింది.. బయటకు పంపేశారు

ABN , First Publish Date - 2023-12-04T10:23:21+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌-7(Biggboss7)లో ఈ వారం గౌతమ్‌ కృష్ణ (goutham krishna) ఎలిమినేట్‌ అయ్యాడు. నామినేషన్‌   తర్వాత ఎలిమినేషన్‌లో అర్జున్‌ అంబటి, శోభాశెట్టి, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌, గౌతమ్‌ కృష్ణ, శివాజీ ఉన్నారు. ఎలిమినేషన్‌   రౌండ్‌ చివరకు వచ్చేసరికి గౌతమ్‌, శోభా మిగిలారు.

Biggboss 7 : డ్రాగన్ బ్రీత్ ఆగింది.. బయటకు పంపేశారు

బిగ్‌బాస్‌ సీజన్‌-7(Biggboss7)లో ఈ వారం గౌతమ్‌ కృష్ణ (goutham krishna) ఎలిమినేట్‌ అయ్యాడు. నామినేషన్‌   తర్వాత ఎలిమినేషన్‌లో అర్జున్‌ అంబటి, శోభాశెట్టి, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌, గౌతమ్‌ కృష్ణ, శివాజీ ఉన్నారు. ఎలిమినేషన్‌   రౌండ్‌ చివరకు వచ్చేసరికి గౌతమ్‌, శోభా మిగిలారు. ఈ ఇద్దరినీ నాగార్జున యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచారు. మీ వెనక రెండు బ్రీతింగ్‌ డ్రాగన్స్‌ ఉన్నాయి. ఏ డ్రాగన్‌ బ్రీతింగ్‌ ఆగిపోతుందో వాళ్లు ఎలిమినేట్‌ అవుతారని అన్నారు. గౌతమ్‌ కృష్ణ వెనక ఉన్న డ్రాగన్‌ బ్రీత్‌ ఆగిపోవడంతో ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. గౌతమ్‌ బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎలిమినేట్‌ కావడం రెండోసారి 35వ రోజు హౌస్‌మేట్స్‌ ద్వారా ఎలిమినేట్‌ చేయబడ్డారు. తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. 91వ రోజున మళ్లీ ఎలిమినేట్‌ అయ్యారు.

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు హౌస్‌లో ఎవరికి మాస్క్‌ ఉంది, ఎవరికి మాస్క్‌ లేదు అనేది చెప్పాలని గౌతమ్‌ను నాగార్జున అడిగారు.

శోభాశెట్టి: గేమ్‌పై పోకస్‌ చేయి. అప్పుడప్పుడు మాస్క్‌ వస్తుంది.

యావర్‌: బాగా  ఆడు. మాస్క్‌ లేదు

ప్రశాంత్‌: శివాజీ అన్నను కొట్టి నువ్వు పైకి రావాలి

శివాజీ: చిన్న మాస్క్‌ ఉంది

అర్జున్‌: మాస్క్‌ లేదు

అమర్‌: మాస్క్‌ వచ్చి పోతుంటుంది. ఫన్నీగా ఉండు

ప్రియాంక: నో మాస్క్‌. నిన్ను ఫైనల్‌లో చూడాలి అంటూ గౌతమ్‌ చెప్పారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనల్‌ విజేత రూ.50 లక్షల కారు, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు గెలుపొందుతారని నాగార్జున ప్రకటించారు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ‘నా సామిరంగ’ హీరోయిన్‌ గ్లింప్స్‌ను హౌస్‌మేట్స్‌కు చూపించారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ అషికా రంగనాథన్‌ బిగ్‌బాస్‌ వేదికై సందడి చేశారు.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ప్రచారంలో భాగంగా నాని కూడా ఇంటి సభ్యులతో మాట్లాడారు.

Updated Date - 2023-12-04T10:24:13+05:30 IST