Geethanjali : ప్రతీకార జ్వాలకు ముహూర్తం కుదిరింది!

ABN , First Publish Date - 2023-09-23T17:03:11+05:30 IST

అంజలి(Anjali) నటించిన ‘గీతాంజలి’ (geethanjali) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! దీనికి సీక్వెల్‌ తీసుకురావాలని మేకర్స్‌ ఎప్పటి నుంచో ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికి ముహూర్తం కుదిరింది.

Geethanjali : ప్రతీకార జ్వాలకు ముహూర్తం కుదిరింది!

అంజలి(Anjali) నటించిన ‘గీతాంజలి’ (geethanjali) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! దీనికి సీక్వెల్‌ తీసుకురావాలని మేకర్స్‌ ఎప్పటి నుంచో ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికి ముహూర్తం కుదిరింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ సీక్వెల్‌ గురించి అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రానికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli vachindi) అనే పేరును ఖరారు చేశారు. వెన్నులో వణుకు తెప్పించే స్పైన్‌ చిల్లింగ్‌ ప్రాజెక్ట్‌ అంటూ థ్రిల్లింగ్‌ అనౌన్స్‌ మెంట్‌ ఇచ్చేశారు మేకర్స్‌.ఈ చిత్రం షూటింగ్‌ శనివారం నుంచి మొదలైంది. కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Geethanjali.2.jpg

అంజలి కథానాయుకగా నటిస్తున్న 50వ సినిమా ఇది. ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు. ఓ పాడుబడ్డ బంగ్లా ప్రాంగణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్టర్‌ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి రామచంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్ర్కిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్‌ సంయుక్తంగా డైరక్టర్‌ శివ తుర్లపాటికి అందజేశారు. అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్‌, సత్య, షక?క శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్‌ మాధవ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - 2023-09-23T17:03:11+05:30 IST