కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Geetha Arts: నార్నే నితిన్‌ హీరోగా జీఎ2 సినిమా!

ABN, First Publish Date - 2023-07-13T13:52:15+05:30

టాలీవుడ్‌ ప్రెస్టీజియస్‌ నిర్మాణ సంస్థల్లో ఒకటైన జీఏ 2 పిక్చర్స్‌ యంగ్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ వరుస హిట్‌ చిత్రాలను సొంతం చేసుకుంటున్నారు నిర్మాత బన్నీ వాస్‌. తాజాగా ఈ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.9 సినిమాను ప్రారంభించారు.

Geetha Arts: నార్నే నితిన్‌ హీరోగా జీఎ2 సినిమా!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ ప్రెస్టీజియస్‌ నిర్మాణ సంస్థల్లో ఒకటైన జీఏ 2 పిక్చర్స్‌ (GA2 Pictures) యంగ్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. అల్లు అరవింద్‌ (Allu aravind) సమర్పణలో వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ వరుస హిట్‌ చిత్రాలను సొంతం చేసుకుంటున్నారు నిర్మాత బన్నీ వాస్‌. తాజాగా ఈ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.9 సినిమాను ప్రారంభించారు. నార్నే నితిన్‌ (Narne Nithin) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ గ్లాస్‌ హౌస్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. దిల్‌ రాజు (Dil raju) కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మారుతి స్ర్కిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు.

2.jpg

అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నార్నే నితిన్‌ హీరోగా నటిస్తోన్న రెండో సినిమా ఇది. నయన్‌ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిర్యాల, సినిమాటోగ్రఫీ: సమీర్‌ కళ్యాణి, ఎడిటర్‌: కోదాటి పవన్‌ కళ్యాణ్‌, ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె.

Updated Date - 2023-07-13T13:53:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!