Game Changer : పాట లీక్‌పై నిర్మాత దిల్‌రాజు ఫైర్‌

ABN , First Publish Date - 2023-09-16T20:02:39+05:30 IST

రామ్‌చరణ్‌ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అంటూ సాగే పాట ఆన్‌లైన్‌ వేదికగా లీక్‌ కాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Game Changer : పాట లీక్‌పై నిర్మాత దిల్‌రాజు ఫైర్‌

రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.(Game changer) కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అంటూ సాగే పాట ఆన్‌లైన్‌ వేదికగా లీక్‌ కాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ విషయంపై నిర్మాత దిల్‌ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సంప్రదించి, పాటను లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా, వాట్సాప్‌తోపాటు ఇతర మాధ్‌యమాల్లో వైరల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. (Song leak)

పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే బలమైన కథాంశంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ సిద్థమవుతోంది. ఇందులో రామ్‌చరణ్‌ రెండు భిన్నమైన లుక్స్‌ కనిపించబోతున్నారని టాక్‌ నడుస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తమన్‌ స్వరకర్తం.

Updated Date - 2023-09-16T20:02:39+05:30 IST