Ram Charan: గేమ్‌ ఛేంజర్‌ కోసం శంకర్‌ భారీ ప్లాన్‌...

ABN , First Publish Date - 2023-07-10T11:46:38+05:30 IST

కాస్త విరామం తర్వాత రామ్‌చరణ్‌ రంగంలో దిగనున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు దర్శకుడు శంకర్‌. దాని కోసం చిత్ర బృందం ఏర్పాటు చేస్తోంది.

Ram Charan: గేమ్‌ ఛేంజర్‌ కోసం శంకర్‌ భారీ ప్లాన్‌...

కాస్త విరామం తర్వాత రామ్‌చరణ్‌ (Ram charan) రంగంలో దిగనున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) షూటింగ్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు దర్శకుడు శంకర్‌ (Shankar). దాని కోసం చిత్ర బృందం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. రామ్‌చరణ్‌ భార్య డెలివరీ సమయం కావడం, మెగా ప్రిన్సెస్‌ పుట్టడంతో ఆయన షూటింగ్‌కు గ్యాప్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ సెట్‌లో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్‌, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రధారులు. శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ బుచ్చిబాబు సానా (Sana buchibabu) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. సెప్టెంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని సంప్రదించినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బుచ్చిబాబు తొలి చిత్రం ‘ఉప్పెన’లో రాయణం పాత్రలో అదరగొట్టాడు విజయ్‌ సేతుపతి నటించారు. ఫుట్‌బాల్‌ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెహమాన్‌తో చర్చలు కూడా పూర్తయినట్లు, ప్రకటన రావడమే ఆలస్యం అన్నట్లు వినిపిస్తోంది.

Updated Date - 2023-07-10T11:48:19+05:30 IST