ఆ సినిమా కోసం రూ. 10 కోట్లు
ABN , First Publish Date - 2023-05-20T02:59:57+05:30 IST
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. జులైకల్లా షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 19న విడుదల చేయడం కోసం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కృషి చేస్తున్నారు....

తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. జులైకల్లా షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 19న విడుదల చేయడం కోసం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కృషి చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరో విజయ్‌కు తండ్రి పాత్ర అది. ఇది గ్యాంగ్‌స్టర్ పాత్ర అనీ, ఈ చిత్రంలో విజయ్ కూడా గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారనీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చిత్రంలోని కీలక సన్నివేశాలను కశ్మీరులో చిత్రీకరించారు. ఈ సినిమాలో నటించడానికి రూ. పది కోట్లు సంజయ్ దత్ తీసుకుంటున్నారని సమాచారం. అలాగే తమిళ వెర్షన్‌లో ఆయనకు విజయ్ సేతుపతి డబ్బింగ్ చెబుతారని అంటున్నారు. మరి ‘లియో’ తెలుగు వెర్షన్‌లో ఆయనకు ఎవరు డబ్బింగ్ చెబుతారో చూడాలి.