ShaakuntalamCollections: మరీ ఇంత దారుణమా... మొదటి రోజు షాకింగ్ కలెక్షన్

ABN , First Publish Date - 2023-04-15T12:26:53+05:30 IST

విడుదలకి ముందు ఎంతో గొప్పగా మాట్లాడిన, చెప్పిన 'శాకుంతలం' సినిమా ఎట్టకేలకు నిన్న శుక్రవారం విడుదల అయింది. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే మాత్రం షాకింగ్ వున్నాయి. ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్టు చేసింది అంటే...

ShaakuntalamCollections: మరీ ఇంత దారుణమా... మొదటి రోజు షాకింగ్ కలెక్షన్
Samantha Ruth Prabhu

గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక సినిమా 'శాకుంతలం' (Shaakuntalam) నిన్న విడుదల అయింది. దీనికి గుణశేఖర్ కూతురు నీలిమ గుణ (Neelima Guna), ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా గురించి దర్శకుడు గుణశేఖర్, నిర్మాత రాజు చాలా గొప్పగా మాట్లాడేరు, చెప్పారు కూడా. ఇందులో సమంత (SamanthaRuthPrabhu) శకుంతల (Shakuntala) పాత్ర పోషించింది. ఆమె కూడా తన కెరీర్ లో ఇదే బెస్ట్ పాత్ర అని చెప్పింది. ఇలాంటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అని కూడా అంది. మలయాళం నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) దుష్యంతుడిగా నటించాడు.

shakuntalam-15a.jpg

ఈ సినిమా మీద చాలా నమ్మకంతో కొందరికి ప్రీమియర్ షోలు కూడా వేశారు. మీడియా వాళ్ళకి కూడా ప్రీమియర్ షోస్ వేశారు. విచిత్రం ఏంటంటే, ఈ సినిమా గురించి ఎంత గొప్పగా చెప్పినా కూడా క్రిటిక్స్ నచ్చలేదు, అలాగే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులకి కూడా ఈ సినిమా నచ్చినట్టు కనపడలేదు.

ఈ సినిమా గుణశేఖర్ 3డి (3D)లో కూడా తీసాడు. అది అంత అవసరమా అని చూసిన ప్రేక్షకులు కొందరు, అలాగే క్రిటిక్స్ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ 3డి సాంకేతిక పరిజ్ఞానం (3D Technology) పూర్తిగా తెలుసుకొని తీసుంటే బాగుండేది అని కొందరు అభిప్రాయం. #ShaakuntalamCollections సినిమా చూస్తున్నప్పుడు అది క్లియర్ గా అందరికీ అర్థం అయింది. ఆ 3డి టెక్నాలజీ మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అని తెలిసింది, తెలియకుండా ఇంత ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ అని, దానికి బదులు 2డి లోనే సినిమా చూపించేస్తే బాగుండేది అని అనుకుంటున్నారు. #ShaakuntalamFilm అదీ కాకుండా ఈ సినిమాకి గ్రాఫిక్స్ చాలా అవసరం, కానీ దర్శకుడు గుణశేఖర్ దాని మీద కూడా సరిగ్గా దృష్టి పెట్టినట్టు కనపడలేదు. ఎందుకంటే ఒకటే గ్రాఫిక్ చేసి, దాన్నే ఇటు తిప్పి, అటు తిప్పి చూపించేసాడు అని అంటున్నారు. అందులో కూడా చాలా లోటుపాట్లు కనపడుతున్నాయి.

shakuntalam-samantha.jpg

ఇంక ఈ కథ అందరికీ తెలిసినది. అందుకే చాలా జాగ్రత్తగా తీయాలి. చాలామంది మొహాలు తెలుగు తెలియనివి, అందుకేనేమో వాళ్ళ మొహాల్లో భావోద్వేగాలు కానీ, ఒక సంఘర్షణ కానీ లేదు. అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హ (Allu Arha) మాత్రం చాలా బాగా చేసింది అని పేరు వచ్చింది.

ఇన్ని లోటుపాట్లతో విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే మాత్రం షాకింగ్ గా వున్నాయి. నైజాం ఏరియా లో ఈ సినిమా కేవలం రూ. 52 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇంకా సీడెడ్, ఉత్తరాంధ్ర కలిపి ఒక రూ.25 లక్షలు వసూల్ చెయ్యగా, ఈస్ట్, వెస్ట్ కలిపి సుమారు రూ.12 లక్షలు మాత్రమే వసూల్ అయింది. గుంటూరు, కృష్ణ, నెల్లూరు కలిపి సుమారు రూ.19 లక్షలు వసూల్ అయింది. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.1.08 కోట్లు వసూల్ చెయ్యగా, ఇంకా ఇండియా మిగతా ప్రాంతాల్లో రూ. 42 లక్షలు, ఓవర్సీస్ రూ.74 లక్షలు వసూల్ చేసింది. మొత్తం ప్రపంచం అంతా కలిపి రూ. 2.24 కోట్లు షేర్ వసూల్ అయింది. అంటే సుమారు రూ.4.70 గ్రాస్ అన్నమాట.

shakuntalam-15.jpg

ఇంత ప్రచారం చేసిన ఇటువంటి సినిమాకు కేవలం ఇంతే వసూల్ అవటం నిజంగా షాకింగ్ అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఒకవేళ ఏదైనా అద్భుతాలు జరిగి ఈ శని, ఆదివారాలు కొంచెం అందుకుంటే కనక ఈ సినిమా కొంచెమైనా నిలబడవచ్చు అని అంటున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నిజం అయ్యే పరిష్టితి లేదు అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-04-15T12:26:56+05:30 IST