Kushi: హమ్మయ్య, మొత్తానికి 'ఖుషి' ప్రచారం మొదలయింది

ABN , First Publish Date - 2023-05-04T16:00:34+05:30 IST

విజయ్ దేవరకొండ ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు, ఎందుకంటే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అతని సినిమా 'ఖుషి' ఈరోజునుండి ప్రచారాలు మొదలెడుతున్నారు. ఈ సినిమా అతనికి చాలా కీలకమైంది, ఎందుకంటే...

Kushi: హమ్మయ్య, మొత్తానికి 'ఖుషి' ప్రచారం మొదలయింది
A still from Kushi

కొన్ని సినిమాలు ఎందుకు డిలే అవుతాయో తెలీదు, కొన్నిసార్లు ఆ డిలే అవటం కూడా మంచిదే అవుతుంది కూడా. విజయ్ దేవరకొండ, (Vijay Deverakonda) సమంత (Samantha) నటిస్తున్న 'ఖుషి' (#Kushi) సినిమా ఎట్టకేలకు ప్రచారాలు చేపట్టారు. శివ నిర్వాణ (Shiva Nirvana) దీనికి దర్శకుడు కాగా, మైత్రి మూవీ మేకర్స్ #MythriMovieMakers నిర్మాతలు. ఈ సినిమా ఎప్పుడో అయిపోయి ఈపాటికి విడుదల కూడా కావాల్సి వుంది, కానీ ఇప్పటికే బాగా డిలే అయింది. నిర్మాతలు ఈ సినిమా నుండి ఒక పాట గురించి ఈరోజు ఈరోజు అధికారిక ప్రకటన ఇచ్చారు. మొదటి పాట మే 9 న విడుదల చేస్తున్నట్టు చెప్పారు.

దీనితో 'ఖుషి' సినిమా ప్రచారాలు మొదలెట్టారనే అనుకోవాలి. ఇందులో కథానాయకురాలిగా నటిస్తున్న సమంత అప్పట్లో మయోసిటిస్ (Myositis) అనే వ్యాధితో బాధపడటం ఆలా ఈ సినిమా షూటింగ్ బాగా డిలే అవటం జరిగింది. ఈ సినిమా టీమ్ ని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఎంత డిలే అయినా, బాగా ఓపికతో అలా ఎదురుచూస్తూ ఆమె ఎప్పుడు మళ్ళీ వస్తుందా అని చూసారు. ఆమె కోలుకున్నాక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. అయితే ఆమె షూటింగ్ పార్ట్ అయిపోయిందో ఇంకా ఉందొ నిర్వాహకులు చెప్పలేదు,ఎందుకంటే సమంత ఇప్పుడు 'సిటాడెల్' #Citadel షూటింగ్ లో వుంది.

vijaydeverakonda.jpg

'శాకుంతలం' #Shaakuntalm సినిమా విడుదల అయిన వెంటనే సమంత లండన్ వెళ్ళిపోయింది 'సిటాడెల్' వెబ్ సిరీస్ కోసం. వరుణ్ ధావన్ (VarunDhawan) ఇందులో లీడ్ యాక్టర్ కాగా, సమంత, ప్రియాంక చోప్రా (PriyankaChopra) పాత్ర వేస్తోంది. ఇది ఇంగ్లీష్ లో వచ్చిన అదే పేరుతో వున్న 'సిటాడెల్' కి భారత వెర్షన్ అని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ 'ఖుషి' #Kushi సినిమా ఇందులో నటించిన విజయ్ దేవరకొండ కి ఎంతో కీలకం. ఎందుకంటే అతని ముందు సినిమా 'లైగర్' #Laigar డిజాస్టర్ అవటం, అతని మీద విపరీతమైన ట్రోల్స్ రావటం, ఆ తరువాత ఈ 'ఖుషి' సినిమా మాత్రమే చెయ్యటం. అందుకని ఈ సినిమా చాలా ముఖ్యమైంది అతనికి.

Updated Date - 2023-05-04T16:09:55+05:30 IST