Akkineni Nagarjuna: ఎట్టకేలకు సినిమా అప్డేట్ వచ్చింది.., మాస్ లుక్ లో నాగ్

ABN , Publish Date - Aug 29 , 2023 | 11:50 AM

అక్కినేని నాగార్జున సినిమా గురించి మొత్తానికి ప్రకటన వచ్చింది. విజయ్ బిన్ని దర్శకత్వంలో నా సామి రంగా అనే సినిమా ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా రాబోయే సంక్రాంతికి విడుదలవుతుందని కూడా ప్రకటించారు.

Nagarjuna's look from his upcoming film Naa Saami Ranga

గత సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన 'ది ఘోస్ట్' #TheGhost నాగార్జున కెరీర్ లో ఒక పెద్ద డిజాస్టర్ సినిమా అని చెప్పొచ్చు. ప్రవీణ్ సత్తారు (PraveenSattaru) ఆ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా తరువాత నాగార్జున (AkkineniNagarjuna) ఎటువంటి సినిమా చేస్తారు, ఎవరితో చేస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా వుండింది. మధ్యలో బెజవాడ ప్రసన్న కుమార్ (BezawadaPrasannaKumar) తో సినిమా వుంది అని అన్నారు కానీ ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు. అప్పటి నుండి మళ్ళీ నాగార్జున సినిమా మీద అందరికీ ఆసక్తికరమే, ఎవరితో చేస్తున్నారు, ఎటువంటి సినిమా చేస్తున్నారు అని.

ఎట్టకేలకి ఆ సస్పెన్స్ అంతా విడిపోయింది. ఈరోజు అంటే ఆగస్టు 29, నాగార్జున పుట్టినరోజు #HBDKingNagarjuna సందర్భంగా అతని రాబోయే సినిమా గురించి ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకి టైటిల్ కూడా 'నా సామి రంగ' #NaaSaamiRanga అని పెట్టి నాగార్జున ఒక మాస్ లుక్ లో వున్న పోస్టర్ విడుదల చేశారు. విజయ్ బిన్ని (VijayBinni) దీనికి దర్శకుడు, అలాగే బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. విజయ్ బిన్ని ఇంతకు ముందు కొరియోగ్రాఫర్ గా అందరికి పరిచయం, ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి దీనికి నిర్మాత.

naasaamiranga.jpg

ఇదిలా ఉండగా, ఇంతకు ముందు బెజవాడ ప్రసన్న కుమార్ అందించిన కథని అతన్నే దర్శకుడిగా పరిచయం చెయ్యాలని నాగార్జున అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమయిందో ప్రసన్న కథ మాత్రమే తీసుకుని, విజయ్ ని దర్శకుడిగా పెట్టుకున్నారు. అయితే ప్రసన్న కుమార్ కథ ఒక మలయాళం సినిమా ఆధారంగా రాసుకున్నది అప్పట్లో కథనాలు వచ్చాయి. అందుకని ఆ కథ నాగార్జున వద్దని అనుకున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ సినిమా వేరే కథతో చేస్తున్నారా, లేదా అప్పుడు అనుకున్న కథేనా అన్నది క్లారిటీ రావాల్సి వుంది.

Updated Date - Jun 24 , 2025 | 12:55 PM