Hidimba: హిడింబకి విముక్తి లభించింది

ABN , First Publish Date - 2023-07-11T17:21:16+05:30 IST

జూన్ 29న 'సామజవరగమన' విడుదల అయింది, ఇప్పుడు జులై 20 న 'హిడింబ' విడుదల అవుతోంది, మళ్ళీ 'భైరవకోన' విడుదలకి రెడీ గా వుంది, ఆ తరువాత చిరంజీవి నటించిన 'భోళా శంకర్' కూడా ఆగస్టు 11న విడుదల అవుతుంది అని ప్రకటించారు. ఈ సినిమాలు అన్నిటికీ అనిల్ సుంకర నిర్మాత కావటం విశేషం. అంటే రెండు వారాలకి ఒక సినిమా విడుదల చేస్తున్నారు అన్నమాట.

Hidimba: హిడింబకి విముక్తి లభించింది
Hidimba releasing on July 20

నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) రెండు వారాల క్రితం విడుదలైన 'సామజవరగమన' (Samajavaragamana) సినిమాతో మంచి హిట్ కొట్టారు. అంతకు ముందు విడుదలైన 'ఏజెంట్' #Agent సినిమా ఫ్లాప్ అందరూ మర్చిపోయేంత పెద్ద హిట్ కొట్టింది ఈ చిన్న సినిమా. రామ్ అబ్బరాజు (RamAbbaraju) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీవిష్ణు (SreeVishnu), రెబా మోనికా జాన్ (RebaMonicaJohn) జంటగా చేశారు. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో బాగానే పోతూ వుంది, ఈలోగా ఇంకో సినిమా విడుదలకి శ్రీకారం చుట్టారు అనిల్ సుంకర.

hidimba2.jpg

అనీల్ కన్నెగంటి (AnilKanneganti) దర్శకత్వంలో వస్తున్న 'హిడింబ' #Hidimba ట్రైలర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఇందులో అశ్విన్ (AshwinBabu), నందిత శ్వేత (NanditaSweta) జంటగా నటించారు. ఈ సినిమాలో బాగా హింస ఉండటం, కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో సెన్సారు వారు ఈ సినిమాకి చాలా కట్స్ చెప్పారు. అందుకు ఒప్పుకోకుండా నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని కమిటీ కి పంపిస్తాం అని చెప్పారు. కమిటి వారు ఈ సినిమాని చూసి, దీనికి సర్టిఫికెట్ ఇచ్చారు.

అందుకని ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించడం కొంచెం లేట్ అయింది అని తెలిసింది. అయినా ఈరోజు అధికారికంగా. ఈ సినిమా జులై 20 న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతోంది, ఈ సినిమాలో యాక్షన్ బాగా ఎక్కువగా ఉంటుందని. ఈమధ్య చాలా సినిమాలు యాక్షన్ ని విపరీతంగా పెడుతున్నారు, ఇందులో కూడా అలాగే వున్నట్టుగా వుంది. అశ్విన్, నందిత శ్వేత ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ గా నటిస్తున్నారు ఇందులో.

Updated Date - 2023-07-11T17:22:05+05:30 IST