#AkhilAkkineni: మొత్తానికి ఏజెంట్ పూర్తి అయింది

ABN , First Publish Date - 2023-01-04T15:57:02+05:30 IST

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) దర్శకుడు సురేందర్ రెడ్డి (Director Surender Reddy) కాంబినేషన్ లో వస్తున్న 'ఏజెంట్' (#AgentFilm) సినిమా మొత్తానికి పూర్తి అయింది అని అంటున్నారు.

#AkhilAkkineni: మొత్తానికి ఏజెంట్ పూర్తి అయింది

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) దర్శకుడు సురేందర్ రెడ్డి (Director Surender Reddy) కాంబినేషన్ లో వస్తున్న 'ఏజెంట్' (#AgentFilm) సినిమా మొత్తానికి పూర్తి అయింది అని అంటున్నారు. ఈ సినిమా మొదలు పెట్టి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు అని, దర్శకుడి మీద నిర్మాతల మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇందులో మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి (Malayalam superstar Mammootty) ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండటం ఒక విశేషం. ఈ సినిమా ముందుగా సంక్రాంతికి (Sankranthi release) విడుదల అని వేసుకున్నారు కానీ, సినిమా షూటింగ్ అవకుండానే ఆలా వేసుకున్నారు అని తెలిసింది, మళ్ళీ విడుదల తేదీ వాయిదా వేసుకున్నారు. సినిమా లో ఇంకా క్లైమాక్స్, ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి ఎప్పుడయినా చిత్రీకరించ వచ్చు అని తెలిసింది.

sakshi-vaidya.jpg

క్లైమాక్ పార్టు ఒక విదేశం లో చిత్రీకరిస్తారని, అప్పుడే ఆ సాంగ్ కూడా అక్కడే చేసేస్తారని తెలిసింది. టీం ఇప్పుడు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద ఫోకస్ పెట్టిందని కూడా తెలిసింది. అఖిల్ అక్కినేని ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు, దీనికోసం ఒక ప్రత్యేకమయిన ఫిజిక్ ని పెంచుకొని లుక్ కూడా మార్చాడు. దానికోసం డైట్ (Akhil is on strict diet for this role) కూడా చాలా పాటించాడు. సాక్షి వైద్య (Sakshi Vaidya is making her film debut with this #Agent) ఈ సినిమా తో కథానాయికగా పరిచయం అవుతోంది. ఇది ఒక స్పై సినిమా, ఇందులో యాక్షన్ సన్నివేశాలు భారీగా వుంటాయని అనుకుంటున్నారు. చాలా కాలం తరువాత అఖిల్ సినిమా ఈ మర్చి నెలలో గానీ, ఏప్రిల్ లో గానీ విడుదల అవొచ్చు అని అనుకుంటున్నారు.

Updated Date - 2023-01-04T15:57:05+05:30 IST