RRR- Oscar winners: ఆస్కార్‌ సన్మాన సభలో నిర్మాత ఎక్కడ? విమర్శల వెల్లువ!

ABN , First Publish Date - 2023-04-10T16:14:32+05:30 IST

అంతర్జాతీయ వేదికపై ఆస్కార్‌ సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందాన్ని యావత్‌ చిత్ర పరిశ్రమ ఘనంగా సత్కరించింది. ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగిన ఈ వేడుక చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, దర్శకులు, రచయిత సంఘం తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు.

RRR- Oscar winners: ఆస్కార్‌ సన్మాన సభలో నిర్మాత ఎక్కడ? విమర్శల వెల్లువ!

అంతర్జాతీయ వేదికపై ఆస్కార్‌ సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)చిత్ర బృందాన్ని యావత్‌ చిత్ర పరిశ్రమ ఘనంగా సత్కరించింది. ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగిన ఈ వేడుక చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, దర్శకులు, రచయిత సంఘం తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. కాస్త ఆలస్యం అయినా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆస్కార్‌ గ్రహీతలు (Oscar Winners) సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌లతోపాటు రాజమౌళిను సత్కరించారు. అయితే ఈ వేడుక నిర్వహిస్తున్నాం అని ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. (CelebRRRating The Oscar Winners)

శనివారం సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌ రామారావు ప్రత్యేకంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమ మొత్తం కలిసి రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుక నిర్వహించాలని సూచించారు. నిధుల కోసం ఎఫ్‌ఎన్‌సీసీ సహకారం కూడా తీసుకుంటే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎలాగైతే పలువురు చొరవతో సన్మాన కార్యక్రమానికి ఓ వేదిక ఏర్పాటైంది. అతిథులకు ఆహ్వానం అందించడంలో నిర్వాహకులు విఫలం అయ్యారనే విమర్శలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అలరించిన సినిమాకు ఘనంగా ఓ వేడుక జరుగుతుంటే పరిశ్రమకు చెందిన బడా హీరోలు, దర్శకనిర్మాతలు, అసలు సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు ఎక్కడా అంటూ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత డి.వి.వి.దానయ్య ఎక్కడా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు సోషల్‌ మీడియా అంతే ఇదే చర్చ జరుగుతుంది. సినిమా నిర్మాత లేకుండా అంత పెద్ద కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తున్నారు. అయితే నిర్మాతతోపాటు అతిథులకు సరైనా ఆహ్వానం అందలేదా? వారివారి పనుల బిజీ వల్ల రాలేక పోయారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇదే విషయంపై నిర్మాత నట్టికుమార్‌ స్పందించారు. కోట్లు ఖర్చు చేసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డీవీవీ దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆస్కార్‌ గ్రహీతలను అంత అర్జంటుగా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు.

‘‘తెలుగు సినిమాకు ఆస్కార్‌ రావడం గర్వకారణం. కానీ ఆస్కార్‌ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. ఆదివారం జరిగిన వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలు రాలేదు. సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను ఎందుకు సంప్రదించలేదు? పరిశ్రమలో ఎంతోమందికి సమాచారమే లేదు. తెలుగు సినిమాకు గొప్ప కీర్తిని తీసుకొచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ బృందాన్ని సన్మానించాల్సిన అవసరం ఉంది. కానీ చేసిన పద్థతి కరెక్ట్‌ కాదు. ఈసీ అనుమతి లేకుండా కౌన్సిల్‌ నుంచి రూ.25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక ఇండస్ర్టీకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కానీ తెలంగాణలో చిన్న సినిమాలకు ఏం చేయట్లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు దక్కుతుంది. చిన్న సినిమాలకు ఐదో షో కావాలని అడుగుతున్నాం. దీనిపై ఇంతవరకు స్పందించనేలేదు. తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కానీ ఇక్కడ 32ు, ఏపీలో 62ు లాభాలు వస్తున్నాయి. అయినా చాలా నిర్మాణ సంస్థలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినీరంగంలో ఏపీ, తెలంగాణ అనే తేడా లేదు. అందరూ కలిసే ఉన్నాం’’ అని నట్టి కుమార్‌ అన్నారు.

Updated Date - 2023-04-10T16:14:33+05:30 IST