Tollywood: కొమర వెంకటేశ్‌ ఇక లేరు!

ABN , First Publish Date - 2023-04-07T22:12:09+05:30 IST

తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేశ్‌ కన్ను మూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Tollywood: కొమర వెంకటేశ్‌ ఇక లేరు!

తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేశ్‌ (Komara venkatesh) కన్ను మూశారు (Korama Venkatesh passes away) . బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. ప్రకాశం జిల్లా మాచర్ల ఆయన స్వస్థలం. జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఏజెంట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఫెడరేషన్‌ అధ్యక్షుడి పలుమార్లు గెలిచారు. చిత్రపురి కాలనీకి కూడా ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘షేర్‌’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. (Film Federation ex president)

కొమర వెంకటేశ్‌ (Producer korama venkatesh) మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు, 24 శాఖలవారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Updated Date - 2023-04-07T22:21:55+05:30 IST