Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. తారల స్పందన!

ABN , First Publish Date - 2023-06-03T18:44:31+05:30 IST

శుక్రవారం రాత్రి ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే! ఇప్పటివరకూ 278 మంది మృతి చెందగా 900 మందికి పైగా గాయాల పాయ్యారు. ఈ విషాదంపై సినీ ప్రముఖులు దిగ్ర్భాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. తారల స్పందన!

శుక్రవారం రాత్రి ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) జరిగిన సంగతి తెలిసిందే! ఇప్పటివరకూ 278 మంది మృతి చెందగా 900 మందికి పైగా గాయాల పాయ్యారు. ఈ విషాదంపై సినీ ప్రముఖులు దిగ్ర్భాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడిమా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. తొలుత ఘటనపై చిరంజీవి, తదుపరి జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. (Film celebs reaction)

‘‘రైలు ప్రమాద ఘటన గురించి తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ప్రస్తుతం క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటానికి రక్తం ఎంతో అవసరం. కాబట్టి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న అభిమానులు అందరూ దయచేసి రక్తదానం చేయండి. సహాయక చర్యలు చేపట్టండి’’ అని చిరంజీవి పిలుపునిచ్చారు. (Chiranjeevi)

‘‘కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన గురించి విని నా హృదయం ముక్కలైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’

- అల్లు అర్జున్‌ (Allu arjun)

ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియగానే హృదయం ముక్కలైంది. ఎన్నో కుటుంబాలు తమ ప్రిమయైునవారిని కోల్పోయారు. వారికి నా సానుభూతి తెలుపుతున్నా. గాయాల పాలైనావారు త్వరగా కోలుకోవాలి.

- మహేశ్‌బాబు(Maheshbabu)

ఒడిశా రైలు ప్రమాద ఘటన గురించి తెలియగానే ఒక్కసారిగా కుంగిపోయా. బాధిత కుటుంబాల గురించి తలుచుకుంటే తీవ్రమైన బాధ కలుగుతుంది. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి.

- అనుష్క శెట్టి (Anushka Shetty)

‘‘రైలు ప్రమాద ఘటన నా హృదయాన్ని కలచివేసింది. ఆ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేయడానికి ముందుకు వచ్చిన స్థానికులకు కృతజ్ఞతలు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’

- యశ్‌ (Yash)

‘‘రైలు ప్రమాద ఘటనతో నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’

రష్మిక (rashmika Mandanna)

‘‘ఇలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం నిజంగానే బాఽధాకరం.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’

సల్మాన్‌ ఖాన్‌ (Salman khan)

Updated Date - 2023-06-03T18:44:31+05:30 IST