Balagam: 'రుద్రమదేవి', 'శాతకర్ణి' కి ఇచ్చినట్టే 'బలగం' సినిమాకి కూడా ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-03-06T18:21:15+05:30 IST

ఆదివారం నాడు 'బలగం' సినిమాకి పని చేసిన అందరినీ సన్మానిస్తూ, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఈ సినిమాకి పన్ని రాయితీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Balagam: 'రుద్రమదేవి', 'శాతకర్ణి' కి ఇచ్చినట్టే 'బలగం' సినిమాకి కూడా ఇవ్వాలి

గత వారం 'బలగం' (Balagam movie) అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమా తెలంగాణ జీవన విధానానికి, తెలంగాణ పల్లె ప్రజల కట్టుబాట్లు కి కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక సినిమా కథ. దీనికి జబర్దస్త్ వేణు (Jabardasth Venu) దర్శకుడు కాగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) కుమార్తె హన్షిత (Hanshitha), హర్షిత్ రెడ్డి (Harshith Reddy)నిర్మాతలు. దిల్ రాజు ఈ సినిమా మొదలయిన దగ్గర నుండి విడుదల అయ్యేంతవరకు వెనకాల ఉండి నడిపించాడు. అయితే ఇందులో కుటుంబ బంధాలు, అనుబంధాలు, ఒక పెద్దాయన ఒక ఇంట్లో చనిపోతే ఆ కుటుంబంలో ఎలాంటి కలతలు వచ్చాయి, మళ్ళీ అదే కుటుంబం ఎలా కలుసుకుంది ఇలాంటివి ఎన్నో విషయాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు వేణు.

అయితే ఈమధ్య వరకు తెలంగాణ భాష (Telangana accent) తెలుగు సినిమాలో ఒక విలన్ కో, లేదా ఒక కమెడియన్ కో పెడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ 'బలగం' (Balagam) సినిమా మొత్తం తెలంగాణ యాసతో అన్ని పాత్రలు అదే భాష మాట్లాడారు. ఇది ఫక్తు తెలంగాణా సినిమా. అయితే అలా అని ఇది ఒక్క తెలంగాణ ప్రజలు చూడటానికి కాదు, మానవ సంబంధాలు ఎక్కడయినా ఒకటే. ఏ ప్రాంతం వారు అయినా ఈ సినిమా చూసి తీరాల్సిందే, అంతటి భావోద్వేగాలు వున్నాయి ఈ సినిమాలో.

balagam2.jpg

మరి అప్పుడెప్పుడో నరసింగ రావు తెలంగాణ సినిమా తీసేవారు, మరి ఇప్పుడు దిల్ రాజు 'బలగం' లాంటి తెలంగాణ సినిమా తీస్తే, ప్రభుత్వం దీనికి పన్ను మినహాయింపు (Tax Exemption) ఇస్తే బాగుంటుంది అని ఆదివారం నాడు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (Film Critics Association) ఈ సినిమా సభ్యులను సన్మానిస్తూ ప్రభుత్వానికి అప్పీల్ చేసారు. మరి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ (Talasani Srinivasa Yadav) కూడా ఈ సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేసారు. మరి అతను ప్రభుత్వానికి ఈ సినిమాకి పన్ను మినహాయింపు (Tax Exemption ) ఇస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేయొచ్చు కదా అని క్రిటిక్స్ రిక్వెస్ట్ చేశారు. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) లీడ్ పెయిర్ గా నటించారు.

Updated Date - 2023-03-06T19:00:37+05:30 IST