Tollywood Box Office: గత వారం విడుదల అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-06-12T17:33:25+05:30 IST

నాలుగు సినిమాలు గత వారం విడుదల అయ్యాయి, అందులో సిద్ధార్థ్ నటించిన 'టక్కర్' కొంచెం పెద్ద సినిమా. దీనితో మళ్ళీ తెలుగులో పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రచారం కూడా చేసాడు సిద్ధార్థ్. అలాగే ఇంకో మూడు చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి. ఈ సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉన్నాయో చూడండి

Tollywood Box Office: గత వారం విడుదల అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే...
Tollywood Box Office

గత వారం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో సిద్ధార్థ్ (Siddharth), దివ్యాంశ కౌశిక్ (DivyanshaKaushik) కథానాయకులుగా 'టక్కర్' #Takkar సినిమా విడుదల అయింది. గత వారం విడుదల అయిన సినిమాలలో ఇదే పెద్దది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ #PeoplesMediaFactory సంస్థ తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమా క్రిటిక్స్ కి, ప్రేక్షకులకి ఇద్దరికీ నచ్చలేదు, అందుకే ఏకగ్రీవంగా ఈ సినిమాని తిరస్కరించారు. సిద్ధార్థ్ మళ్ళీ తెలుగులోకి ఈ సినిమాతో వద్దామని ఎంతో ఆశపడ్డాడు కానీ, సినిమాలో దమ్ము లేదు. కంటెంట్ లేదు, వూరికే సాగదీసాడు దర్శకుడు కథను. అందుకని ఈ సినిమా తెలుగులో వాష్ అవుట్ అని చెప్పొచ్చు. పాపం సిద్ధార్థ్ ఇంకో సినిమా కోసం ఎదురు చూడాల్సిందే.

takkar6.jpg

ఇక సముద్రఖని (Samuthirakani), అనసూయ (AnasuyaBharadwaj), ధనరాజ్ (Dhanraj), రాహుల్ రామకృష్ణ (RahulRamakrishna) నటించిన 'విమానం' #Vimanam సినిమా విడుదల అయింది. ఈ సినిమాని సాంఘీక మాధ్యమాల్లో బాగా ప్రచారం చేశారు. అలాగే ఇందులో భావోద్వేగాలు బావుంటాయని, చూడాల్సిన సినిమా అని విడుదలకి ముందు చెప్పారు. ఇది తండ్రి కొడుకుల మధ్య నడిచే భావోద్వేగ డ్రామా. నాలుగో తరగతి చదువుతున్న తన కొడుకుకి కాన్సర్ అని తెలిసి, అతని ఆఖరి కోరిక అయిన విమానం ఎక్కించాలని తాపత్రయపడే ఒక తండ్రి కథ ఈ సినిమా నేపధ్యం. మంచి కథ తీసుకున్నాడు కానీ, దర్శకుడు దానికి తగ్గట్టుగా భావోద్వేగాలను పలికించలేకపోయాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించి విడుదల చేయడంలో, తెలుగు, తమిళ నటులు ఇందులో కనపడతారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

vimanamboxoffice.jpg

ఇంకో రెండు చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి. డైమండ్ రత్నబాబు (DiamondRatnababu) దర్శకత్వం లో 'బిగ్ బాస్' (BiggBoss) ఫేమ్ విజె సన్నీ (VJ Sunny) నటించిన 'అన్ స్టాపబుల్' (Unstoppable) సినిమా విడుదల అయింది. ఈ సినిమా గురించి అయితే ఎవరూ మాట్లాడటం కూడా లేదు, అంటే ఈ సినిమా ఎంత ఫ్లాప్ అయిందో తెలుస్తుంది.

unstoppable2.jpg

ఇంకో చిన్న సినిమా 'ఇంటింటి రామాయణం' (IntintiRamayanam) విడుదల అయింది కానీ ఈ సినిమా గురించి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఇందులో సీనియర్ నరేష్ (VKNaresh), రాహుల్ రామకృష్ణ వున్నారు. ఇలాంటి ఒక సినిమా ఉందని, విడుదల అయిందని కూడా ప్రేక్షకులకి తెలీదు అని బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఓటిటి లో రావాల్సింది, థియేటర్ లోకి వచ్చింది అని అన్నారు, అయినా థియేటర్ లో ఎవరూ చూడటానికి ఇష్టపడలేదు.

ఇలా విడుదల అయిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేదని చెప్పారు.

Updated Date - 2023-06-12T17:33:25+05:30 IST