Fans - Netizens: ఆరెంజ్‌ 2 తీయ్‌ అన్నా.. ఈసారి హిట్‌ చేస్తాం!

ABN , First Publish Date - 2023-04-02T15:19:02+05:30 IST

‘అన్నా ఆరెంజ్‌ -2 తీయ్‌ అన్నా.. ఈసారి హిట్‌ చేస్తాం.. అప్పుడంటే చిన్న పిల్లలం.. అర్ధం చేసుకోలేకపోయాం.. ఈ సారి బరాబర్‌ సూపర్‌హిట్‌ చేస్తాం’’

Fans - Netizens: ఆరెంజ్‌ 2 తీయ్‌ అన్నా.. ఈసారి హిట్‌ చేస్తాం!

‘అన్నా ఆరెంజ్‌ -2 తీయ్‌ అన్నా.. ఈసారి హిట్‌ చేస్తాం.. అప్పుడంటే చిన్న పిల్లలం.. అర్ధం చేసుకోలేకపోయాం.. ఈ సారి బరాబర్‌ సూపర్‌హిట్‌ చేస్తాం’’ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ను (Bommarillu Bhaskar) ఓ అభిమాని కోరిని కోరిక ఇది. అలందుకు షాకై దండం పెట్టేశారు. తాజాగా ఓ థియేటర్‌లో భాస్కర్‌కు ఎదురైన అనుభవం ఇది. అసలు విషయం ఏంటంటే.. రామ్‌చరణ్‌ (Ram charan) పుట్టిరరోజు సందర్భంగా ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ‘ఆరెంజ్‌’(Orange) సినిమారు డిజిటలైజ్‌ చేసి 4కె రిజల్యూషన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చి 27న విడుదల చేశారు. అప్పుడు డిజాస్టర్‌ అయిన ఈ చిత్రం ఇప్పుడు సూపర్‌ హిట్టైంది. దీంతో చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉంది. అభిమానులతో కలిసి థియేటర్‌లో చూడటానికి వెళ్లిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ను ఓ అభిమాని ఇలా కోరారు. ‘‘అన్నా ఆరెంజ్‌ -2 తీయ్‌ అన్నా.. ఈసారి హిట్‌ చేస్తాం.. అప్పుడంటే చిన్న పిల్లలం.. అర్ధం చేసుకోలేకపోయాం.. ఈ సారి బరాబర్‌ సూపర్‌హిట్‌ చేసి చూపిస్తాం’ అని అన్నాడు. దానికి భాస్కర్‌ దండం పెడుతూ వద్దురా బాబు అన్నట్లు చేతితో సైగా చేశాడు. అయినా ఆ యువకుడు వదల్లేదు. ‘ఆరెంజ్‌’ పార్ట్‌ 2 తీయ్‌ అన్నా అంటూ బతిమలాడాడు. భాస్కర్‌ మాత్రం సైలెంట్‌గా సైడ్‌ అయిపోయాడు. (Fans need Orange 2)

2010లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరచింది. నిర్మాత నాగబాబు బాగా నష్టపోయారు. సినిమా ఫ్లాప్‌ అయింది కానీ ఆ చిత్రంలో పాటలు మాత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా రీ రిలీజ్‌ అయిన ఈ చిత్రం బజ్‌ క్రియేట్‌ చేసింది. థియేటర్స్‌ అన్నీ హౌస్‌ ఫుల్‌ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనిపై నాగబాబు కూడా హర్షం వ్యక్తం చేశారు. ‘అప్పుడు హిట్‌ ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ చిత్రం ఇంత భారీ విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. చరణ్‌కి ఫ్లాప్‌ సినిమా ఇచ్చాననే బాధ తీరిపోయింది’’ అని స్పందించారు. అయితే అభిమానులు కోరిక మేరకు బొమ్మరిల్లు భాస్కర్‌ రెండో ప్రయత్నం చేసేలా కనపించడం లేదు!

Updated Date - 2023-04-02T15:26:11+05:30 IST