Pawan kalyan: బర్త్‌డే గిప్ట్.. 470కేజీల వెండి చిత్ర పటం!
ABN , First Publish Date - 2023-08-31T23:13:42+05:30 IST
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు అభిమానుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్న సంగతి తెలిసిందే! ఆయన పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులు చేసే కోలాహలం అంతాఇంతా కాదు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు అభిమానుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్న సంగతి తెలిసిందే! ఆయన పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులు చేసే కోలాహలం అంతాఇంతా కాదు. ఓ పండగలా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో చేస్తారు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఓ అభిమానులు కొందరు కలిసి పవర్‌స్టార్ అదరహో అనే బహుమతి అందించారు. ఏకంగా 470 కేజీల వెండి గొలుసులతో పవన్‌కల్యాణ్ చిత్ర పటాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీ సుందర రామిరెడ్డి పాల్గొన్నారు.
జనసేన పార్టీ నెల్లూరు టౌన్ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ అద్భుత చిత్ర పటాన్ని రూపొందించారు. 15 గంటలు కష్టపడి మొదట పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశారు. ఆ లైన్స్‌ను వెండి? గొలుసులతో నింపారు. ఈ ఫొటోను గొలుసులు ముస్తాబు చేేసందుకు 470 కేజీల వెండిని ఉపయోగించినట్లు జనసైనికులు తెలిపారు.
ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఓజీ’ చిత్రాల మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అప్‌డేట్‌లతో అలరించడానికి పక్కాగా ప్లాన్ చేశారు.