Pavitra -Naresh : నరేశ్‌ ఏం చేశాడంటే

ABN , First Publish Date - 2023-06-01T18:11:48+05:30 IST

ఈ మధ్యకాలంలో ఏ మీడియాలో చూసినా పవిత్రా నరేశ్‌ల జంట గురించే చర్చ. మోస్ట్‌ ట్రెండిండ్‌, ట్రోలింగ్‌ సెలబ్రిటీ కపుల్‌ అంటే వీరే. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

Pavitra -Naresh : నరేశ్‌ ఏం చేశాడంటే

ఈ మధ్యకాలంలో ఏ మీడియాలో చూసినా పవిత్రా నరేశ్‌ల (pavithra NAresh) జంట గురించే చర్చ. మోస్ట్‌ ట్రెండిండ్‌, ట్రోలింగ్‌ సెలబ్రిటీ కపుల్‌ అంటే వీరే. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘మళ్లీ పెళ్లి’ (Malli pelli) చిత్రంతో ముందుకు రావడం.. ఆ స్టోరీ వీళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథ కావడంతో ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచారు. సిననిమా రిలీజ్‌ వరకూ వరుస ఇంటర్వ్యూలో యూట్యూబ్‌ని షేక్‌ చేసిన ఈ జంట.. ఇప్పుడు మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో అయితే రచ్చ అయితే ఆగట్లేదు. ఏదోలా ఈ జంట పేర్లు వినిపిస్తూనే ఉంది.

తాజాగా పవిత్ర విషయంలో నరేష్‌ చేసిని పనికి విమర్శించిన వారే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ నరేశ్‌ ఏం చేశాడంటే.. పవిత్రతో పరీక్ష రాయించాడు. చాలాకాలంగా పవిత్రకు తన మాతృ భాష కన్నడలో పీహెచ్‌డీ చేయాలనే కోరిక అట. అందుకోసం ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ (Exams For Pavithra)రాయడానికి పవిత్రను తీసుకుని బళ్ళారి వెళ్లారు నరేశ్‌. పరీక్ష రాసేంత వరకూ అక్కడే ఉన్నాడట. పరీక్ష హాల్‌లోకి అనుమతి లేదు కానీ.. పరీక్షా కేంద్రంలోనే ఉండి దగ్గరుండి పరీక్ష రాయుంచాడట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ‘గొప్ప పని చేశావ్‌’ అంటూ మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2023-06-01T18:22:51+05:30 IST