ప్రతి ఏడాదీ సాయం చేస్తా
ABN , First Publish Date - 2023-09-16T00:31:40+05:30 IST
‘ఖుషి’ సినిమాకు ఘన విజయం అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు హీరో విజయ్ దేవరకొండ.....

‘ఖుషి’ సినిమాకు ఘన విజయం అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఎంపిక చేసిన వంద లక్కీ ఫ్యామిలీ్‌సకు లక్ష రూపాయల చొప్పున ఆయన చెక్కులు అందించారు. ఆ చెక్కులు అందుకున్న కుటుంబాల సభ్యులు ఉద్వేగానికి లోనై విజయ్‌ను హగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘నాకు ఇంత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి పనులు చేయాలని ఉంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండునని అనుకున్నవాడినే. కానీ ఎవరినీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఒక ఫ్యామిలీగా ఈ స్థాయికి చేరుకున్నా. ఇవాళ మీకు సాయం చేయగలుగుతున్నా. ఈ లక్ష రూపాయలు అందిన తర్వాత కొంచెం సంతోషం కలిగి ఒత్తిడి తగ్గి బలాన్ని ఇచ్చి మీకు ఆనందం కలిగిస్తే అదే నాకు సంతృప్తి. ఈ చిన్న సాయం మీకు ఉపయోగపడితే అదే నాకు హ్యాపీ. మీతో నా ప్రేమను షేర్ చేసుకుంటున్నాను. నాకు థాంక్స్ చెప్పకండా. ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే 50 వేల అప్లికేషన్స్ వచ్చాయి. కానీ వంద మందికి మాత్రమే సాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది మరికొందరికి ఇలా హెల్స్ చేస్తా. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంత కాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా’ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ కూడా పాల్గొన్నారు.