Chiranjeevi: క్రేజ్‌కి.. ఈజ్‌కి.. వయసుకి.. సరిపడేలా...

ABN , First Publish Date - 2023-06-08T13:13:44+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి (Mega star Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఈ రెండు చిత్రాలు ఉన్నాయి. వశిష్ఠ చిరంజీవి కోసం సోషియో ఫాంటసీ నేపథ్యంలో కథ తయారు చేశారు. ఇందులో ఎనిమిది మంది కథానాయికలు ఉన్నారని తెలిసింది.

Chiranjeevi: క్రేజ్‌కి.. ఈజ్‌కి.. వయసుకి.. సరిపడేలా...

మెగాస్టార్‌ చిరంజీవి (Mega star Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘భోళా శంకర్‌’(Bhola shankar) చిత్రం షూటింగ్‌ తుది దశలో ఉంది. ఆగస్ట్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తదుపరి రెండు చిత్రాలకు సై అన్నారు చిరంజీవి. ‘బింబిసారా’తో హిట్‌ అందుకున్న వశిష్ఠతో (Vasista) ఓ సినిమా చేయనున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేం కల్యాణ్‌ కృష్ణ కురసాల (Kalyan krishna) కూడా చిరుకి ఓ కథ చెప్పి మెప్పించారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఈ రెండు చిత్రాలు ఉన్నాయి.

వశిష్ఠ చిరంజీవి కోసం సోషియో ఫాంటసీ నేపథ్యంలో కథ తయారు చేశారు. ఇందులో ఎనిమిది మంది కథానాయికలు ఉన్నారని తెలిసింది. అందరి పాత్రలు కథకు కీలకంగానే ఉంటాయట. ఇప్పటికే హీరోయిన్ల వేట మొదలైందని సమాచారం. చిరు వయసుకీ, క్రేజ్‌కీ, ఈజ్‌కీ సరిపడా హీరోయిన్ల లిస్టు ఒకటి దర్శకుడు తయారు చేస్తున్నారు. ఇందులో స్టార్‌ హీరోయిన్లు ఉన్నారు. కొత్తగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన వాళ్లూ ఉన్నారు. ఆ సమయానికి ఎవరు అందుబాటులో ఉంటే వారిని ఎంపిక చేసుకునే దిఽశగా దర్శకుడి ఆలోచన ఉందట.

వశిష్ఠ, కల్యాణ్‌ కృష్ణ సినిమాలు వశిష్ట సినిమాలు ఒకేసారి సెట్స్‌ మీదకు తీసుకుని పారలల్‌గా చిత్రీకరణ చేయాలని భావిస్తున్నారు. వశిష్ట కథలో గ్రాఫిక్స్‌ హంగులకు ప్రాధాన్యం ఉంది. దాంతో విడుదల కాస్త ఆలస్యం కావచ్చు. సంక్రాంతి బరిలో కల్యాణ్‌ కృష్ణ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు.

Updated Date - 2023-06-08T13:13:44+05:30 IST