Dulquer Salmaan: దర్శకుడు వెంకీ అట్లూరి ఇంకో పాన్ ఇండియన్ సినిమాతో

ABN , First Publish Date - 2023-05-14T11:58:21+05:30 IST

దుల్కర్ సల్మాన్ ఇంకో తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరి తో చేతులు కలిపాడు. ఈ సినిమా అన్ని భాషల్లోనూ విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి

Dulquer Salmaan: దర్శకుడు వెంకీ అట్లూరి ఇంకో పాన్ ఇండియన్ సినిమాతో
Dulquer Salman

దర్శకుడు వెంకీ అట్లూరి (VenkyAtluri) ఆమధ్య ధనుష్ (Dhanush) తో 'సర్' (Sir) అనే సినిమా తెలుగు, తమిళ ద్విభాషల్లో తీసి విజయం సాధించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (SitharaEntertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని నిర్మించాయి. ఆ విజయంతో మళ్ళీ ఈ రెండు సంస్థలు కలిపి, అదే వెంకీ అట్లూరి తో ఇంకో పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేశాయి. అయితే ఈసారి ఇందులో నటించబోయేది ఎవరో తెలుసా, మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ (DulquerSalman). ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, మిగతా భాషల్లో కూడా విడుదల ఉంటుంది అని తెలిసింది.

dulquerslaman.jpg

దుల్కర్ సల్మాన్ 'సీతారామం' (Sita Ramam) అనే తెలుగు సినిమాలో నటించి, పెద్ద విజయం సాధించాడు. అతను కూడా ఒక్క మలయాళంలో కాకుండా, తన మార్కెట్ ని మిగతా భాషల్లోకి కూడా విస్తరించాలని అనుకుంటున్నాడు, అందుకనే ఈ పాన్ ఇండియా సినిమాకి ఒప్పుకున్నాడు. అతనికి పారితోషికం కూడా బాగానే ముట్టింది అని అంటున్నారు. అదీ కాకుండా దుల్కర్ సల్మాన్ ఏ భాషలో నటించినా, అక్కడి సంస్కృతికి తగ్గట్లుగా తనను తాను మలచుకొని, ఆ భాషకి సంబందించిన వ్యక్తిగానే అందరికీ చేరువ అవుతారు.

ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది అని చిత్ర నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని చెప్పారు.

Updated Date - 2023-05-14T11:58:21+05:30 IST