Dulquer Salman: 'లక్కీ భాస్కర్' గా దుల్కర్ సల్మాన్

ABN , First Publish Date - 2023-07-28T15:19:43+05:30 IST

మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తెలుగులో 'సీత రామం' మంచి విజయం సాధించాక దుల్కర్ కి తెలుగులో ఇప్పుడు అవకాశాలు ఎక్కువయ్యాయి. తెలుగు నటులతో పోటీగా ఇప్పుడు దుల్కర్, దర్శకుడు వెంకీ అట్లూరి తో చేస్తున్న సినిమాకి ఈరోజు దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ కూడా ప్రకటించేశారు

Dulquer Salman: 'లక్కీ భాస్కర్' గా దుల్కర్ సల్మాన్
Dulquer Salman

మలయాళం స్టార్ నటుడు అయిన దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఇప్పుడు మిగతా భాషల్లో కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మొదటిసారి తెలుగులో ఒక డైరెక్ట్ సినిమా 'సీతారామం' (SitaRamam) చేసి ఆ సినిమాతో మంచి విజయం నమోదు చేసుకొని, మళయాళంలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా తన సత్తా ఏంటో చాటాడు దుల్కర్. ఇప్పుడు ఇతను పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, తన తదుపరి సినిమా దర్శకుడు వెంకీ అట్లూరితో (VenkyAtluri) చేస్తున్నాడు. ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమానే.

వెంకీ అట్లూరి ఇంతకు ముందు ధనుష్ (Dhanush) తో చేసిన 'సార్' (Sir) (వాతి)తో (Vaathi) పెద్ద విజయం అందుకొని, అగ్ర దర్శకుల జాబితాల్లో చేరిపోయాడు. అలాగే అందులో ఒక మెసేజ్ కూడా ఉండటంతో ఆ చిత్ర విజయం వెంకీ కి దర్శకుడిగా మరింత ఖ్యాతిని తీసుకొచ్చింది. అది తెలుగు, తమిళంలో విజయ్ సాధిస్తే, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న ఈ సినిమాతో తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నాడు వెంకీ అట్లూరి.

dulquerslaman2.jpg

'సార్' సినిమాని నిర్మించిన, సూర్యదేవర నాగవంశీ (SuryadevaraNagaVamsi), సాయి సౌజన్య ఈ దుల్కర్, వెంకీ కాంబినేషన్ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి మరో విభిన్న కథాంశంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. 'నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ' గా ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర నిర్మాతలు ఈ సినిమా కథ గురించి తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రానికి 'లక్కీ భాస్కర్' #LuckyBhaskar అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ (GVPrakashKumar) సంగీతం, మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి (NaveenNooli) ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-07-28T15:19:43+05:30 IST