Double Ismart: రామ్‌-పూరి కాంబో మళ్లీ సెట్‌ అయింది!

ABN , First Publish Date - 2023-07-10T15:32:45+05:30 IST

రామ్‌ పోతినేని, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మాస్‌ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే! ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ సిద్థం కానుంది. దీనికి సంబంధించిన ఇస్మార్ట్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్రబృందం. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది.

Double Ismart: రామ్‌-పూరి కాంబో మళ్లీ సెట్‌ అయింది!

రామ్‌ పోతినేని(Ram potineni), పూరి జగన్నాథ్‌ (puri Jaganath) కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మాస్‌ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే! ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ సిద్థం కానుంది. దీనికి సంబంధించిన ఇస్మార్ట్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్రబృందం. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది. చిత్ర బృందం ఈ ఫోటోలను విడుదల చేసింది. రెగ్యులర్‌ షూటింగ్‌ జులై 12 నుంచి మొదలు కానుందని తెలిపారు.

Untitled-1.jpg

పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ‘ఈ సారి వినోదం, యాక్షన్‌ అన్నీ డబుల్‌. మీ అందరికి డబుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఇవ్వడానికి మేం తిరిగి వచ్చేశాం’ అంటూ రామ్‌ సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు.

Updated Date - 2023-07-10T15:33:13+05:30 IST