‘దూర‌మే తీర‌మై’.. డెవిల్ నుంచి అద్భుత‌మైన మెలోడీ సాంగ్ రిలీజ్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 05:40 PM

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తాజాగా న‌టిస్తున్న చిత్రం డెవిల్. వారం రోజుల క్రితం విడుద‌ల చేసిన‌ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేయ‌గా ఈ రోజు సోమ‌వారం (18.12.2023) దూర‌మే తీర‌మై అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు.

‘దూర‌మే తీర‌మై’.. డెవిల్ నుంచి అద్భుత‌మైన మెలోడీ సాంగ్ రిలీజ్‌
devil

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ (Kalyanram Nandamuri) తాజాగా న‌టిస్తున్న చిత్రం డెవిల్ (Devil The Movie) త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. వారం రోజుల క్రితం విడుద‌ల చేసిన‌ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేయ‌గా ఈ రోజు సోమ‌వారం (18.12.2023) రోజు మూడవ పాట‌ను విడుద‌ల చేశారు. దూర‌మే తీర‌మై (Doorame Theeramai ) అంటూ సాగే 4 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్న ఈ పాట‌కు యానిమ‌ల్ సినిమాకు సంగీతం అందించిన హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ సంగీతాభిమానుల‌ను ఆక‌ట్టుకునేలా ఈ పాట‌కు బాణీలు అందించారు.

క‌ల్యాణ్‌రామ్ (Kalyanram Nandamuri) క‌థానాయ‌కుడిగా, సంయుక్త (Samyuktha), మాళ‌వికా నాయ‌ర్ (Malvika Nair)లు క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై అభిషేక్ ఆగ‌ర్వాల్ (Abhishek Nama ) నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్రిటిష్ కాలంలో ఓ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ కోసం వ‌చ్చిన ఓ బ్రిటీష్ ఏజెంట్ ఈ కేసును ఎలా ఛేదించాడు దాని వెన‌కాల ఉన్న మ‌ర్మాల‌ను బ‌య‌ట‌కు ఎలా తెచ్చాడ‌నే నేప‌థ్యంలో సినిమా ఉండ‌నుంది.


డిసెంబ‌ర్ 29న ఈ సినిమా విడుద‌ల కానున్న క్ర‌మంలో చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచింది. టీమ్ అంతా క‌లిసి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ చిత్రాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్న‌ది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రెండు పాట‌లు విడుద‌ల చేయ‌గా అవి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.

Updated Date - Dec 18 , 2023 | 05:44 PM