RowdyRohini: రౌడీ రోహిణికి 10 గంటలపాటు సర్జరీ చేసి రాడ్ తీశారు, కానీ...

ABN , First Publish Date - 2023-05-18T15:41:38+05:30 IST

'బలగం', 'సేవ్ టైగెర్స్', 'జబర్దస్త్' షో లలో బాగా పాపులర్ అయిన రౌడీ రోహిణి కాలుకి సుమారు పది గంటలపాటు సర్జరీ చేసి ఆమె కాలులో వుండిపోయిన రాడ్ ని తీశారు. కానీ...

RowdyRohini: రౌడీ రోహిణికి 10 గంటలపాటు సర్జరీ చేసి రాడ్ తీశారు, కానీ...
Rowdy Rohini showing the rod and talking about the surgery

రౌడీ రోహిణి (RowdyRohini) గా అందరికీ సుపరిచితం అయిన రోహిణి 'జబర్దస్త్' (Jabardasth) షో లో కూడా చాలా పాపులర్ అయింది. ఈమధ్య 'బలగం' (Balagam) సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది, అలాగే ఈమధ్య విడుదల అయిన వెబ్ సిరీస్ 'సేవ్ టైగెర్స్' (SaveTigers) లో కూడా మంచి కామెడీ నటిగా పేరు సంపాదించుకుంది. మరి రోహిణికి ఏమైంది, ఎందుకు సస్త్ర చికిత్స చేశారు అంటే... కొన్ని సంవత్సరాల క్రితం రోహిణి కి యాక్సిడెంట్ అయినపుడు కాలుకి దెబ్బ తగిలింది, అప్పుడు ఆపరేషన్ చేసి కాలులో ఒక రాడ్ వేశారు.

rowdyrohini.jpg

అయితే ఒకటి రెండు సంవత్సరాల లోపు ఆ రాడ్ ని తీసెయ్యాలి, కానీ రోహిణి ఆలా చెయ్యకుండా చాలా ఏళ్ళు ఉంచేసింది. #RohiniSurgery ఆ రాడ్ ఆమె కాలులో అతుక్కుపోయింది, మళ్ళీ కాలుకు నొప్పి వచ్చింది. అయితే ఇప్పుడు రాడ్ తీయాలంటే చాలా కష్టం అని హైదరాబాద్ డాక్టర్స్ చెప్పారని, కానీ ఎలా అయినా తీసెయ్యాలి రాడ్ అని రోహిణి విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక వారం క్రితం జాయిన్ అయింది.

rowdyrohini2.jpg

"నేను హైద్రాబాద్ లో అడిగితే తీయటం కష్టం అన్నారు, అప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ చేసిన డాక్టర్ ని అడిగాను. అతను అవుతుంది విజయవాడ రమ్మన్నారు. అప్పుడు విజయవాడ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. సుమారు 10 గంటలు శ్రమించి, సర్జరీ చేసి డాక్టర్లు రాడ్ ని తీసారని," చెప్పింది రోహిణి తన యూట్యూబ్ ఛానల్ లో. అయితే ఆమె కనీసం ఒక ఆరు వారాలపాటు, కాలు కిందన పెట్టకూడదు, అలాగే బరువు కూడా పెట్టకూడదు అని చెప్పారు డాక్టర్లు.

rowdyrohini3.jpg

రోహిణి త్వరలోనే విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చేస్తా అని, అలాగే ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా మళ్ళీ సెట్స్ మీదకి రావాలని అనుకుంటున్నా అని చెప్పింది. రోహిణి మదర్ ఆమెకి సాయంగా హాస్పిటల్ వుంది అన్నీ చూసుకున్నారు.

Updated Date - 2023-05-18T15:41:38+05:30 IST