Sai Dharam Tej: భయం పోవడానికి సాయి ధరమ్ తేజ్ ఏమి చేసాడో తెలిస్తే షాక్ అవుతారు...

ABN , First Publish Date - 2023-07-26T13:24:50+05:30 IST

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్నాక సినిమాలు చేసి విజయం సాధించాడు, అలాగే అతను బైక్ మీద నుంచి పడిపోయి యాక్సిడెంట్ అయింది కాబట్టి, బైక్ అంటే భయం ఉంటుంది, కానీ ఆ భయం పోవడానికి ఏమి చేసాడో తెలుసా....

Sai Dharam Tej: భయం పోవడానికి సాయి ధరమ్ తేజ్ ఏమి చేసాడో తెలిస్తే షాక్ అవుతారు...
Sai Dharam Tej

నటుడు సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) కి యాక్సిడెంట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అతను బైక్ మీద వెళుతుండగా, రోడ్ మీద ఇసుక ఎక్కువగా ఉండటంతో, తన బైక్ స్కిడ్ అయి పడిపోయిన సాయి ధరమ్ తేజ్ 12 రోజులు కోమాలో వున్నాడు. ఆ తరువాత మెల్లగా తేరుకొని బయట పడ్డాడు. ఆరోగ్యం కొంచెం కుదుటపడిన తరువాత 'విరూపాక్ష' #Virupaksha సినిమా చేసి పెద్ద విజయం సాధించి ఆ యాక్సిడెంట్ విషయాన్ని మెల్లగా మరిచిపోయాడు.

బైక్ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మళ్ళీ బైక్ తొక్కాలంటే భయపడతారు. కానీ సాయి ధరమ్ తేజ్ ఆలా చెయ్యలేదు. "మా అమ్మగారే నాకు బైక్ కీస్ ఇచ్చి, బైక్ తొక్కమని చెప్పారు. ఎందుకంటే బైక్ అంటే భయం పోవడానికి. అందుకని ముందుగా మా పార్కింగ్ ఏరియాలో చిన్న చిన్నగా బైక్ డ్రైవ్ చేసేవాడిని. తరువాత కొంచెం డిస్టెన్స్, ఆలా అలా మళ్ళీ బైక్ తొక్కుతూ ఆ భయం నుండి బయటపడ్డాను. ఇప్పుడు బైక్ మళ్ళీ బాగానే డ్రైవ్ చెయ్యగలను," అని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.

saidharamtej-pk.jpg

అయితే అప్పుడు యాక్సిడెంట్ ఆయిన బైక్ ఏమి చేశారు అంటే, అదే అమ్మేయాల్సి వచ్చింది అని చెప్పాడు సాయి తేజ్. ఆ బైక్ మా తాతగారు కొనిచ్చారు, కానీ యాక్సిడెంట్ తరువాత అమ్మేయవలసి వచ్చింది. ఇప్పుడు వేరే బైక్ తీసుకున్నాను అని చెపుతున్నాడు సాయి ధరమ్ తేజ్.

తన మామ పవన్ కళ్యాణ్ (PawanKalyan) తో 'బ్రో' #Bro సినిమాలో నటించిన సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈనెల 28న విడుదల అవుతోంది ఆ సినిమా. "కరుడుకట్టిన రాయిలాంటి మనసున్న మనిషైనా కూడా, చివరి 15 నిముషాలు చూసి భావోద్వేగానికి గురి అవుతాడు, నాకు ఆ సినిమా మీద అంత నమ్మకం," అని చెప్పాడు సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా గురించి. సముద్రఖని (Samuthirakani) దానికి దర్శకుడు కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.

Updated Date - 2023-07-26T13:24:50+05:30 IST