సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Manoj: రామ్ చరణ్ పుట్టిన రోజుకి ఏమి చేసాడో చూస్తే షాక్ అవుతారు

ABN, First Publish Date - 2023-03-27T13:51:14+05:30

ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు. అందుకని అన్ని దగ్గరలా నుండి అతనికి వెల్లువలా పుట్టినరోజు శుభాకాంక్షురాలు తెలుపుతూ వున్నారు. అయితే అతని మిత్రుడు మంచు మనోజ్ మాత్రం వెరైటీ గా చెప్పాడు తన విషెస్. అదెలా అంటే....

File photo of Manoj and Ram Charan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్చి 27, రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు. ఈ సంవత్సరం రామ్ చరణ్ కి కొంచెం వైవిధ్యంగా వుండే పుట్టిన రోజు, సెలబ్రేషన్స్ చేసుకునే రోజు. ఎందుకంటే రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా లో డాన్స్ చేసిన 'నాటు నాటు' (Naatu Naatu) పాట ఆస్కార్ అవార్డు (Oscar Award) గెలుచుకుంది. ఆలా గెలవటానికి తెర వెనక రామ్ చరణ్ తన వంతు కృషి తాను చేసాడు. అమెరికా వెళ్లి అక్కడ ప్రచార బాధ్యతలను మోశాడు. ఇదంతా కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక అద్భుతమయిన మెమరీ.

ఇప్పుడు హైదరాబాద్ లో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ (shankar shanmugham) సినిమా 'గేమ్ చేంజర్' (#GameChanger) షూటింగ్ లో వున్నాడు. ఈరోజు మెగా అభిమానులు అందరూ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. రామ్ చరణ్ సినిమా 'ఆరంజ్' (Orange) మళ్ళీ విడుదల చేశారు, విడుదల అయినా చోటల్లా ఆ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇవన్నీ ఇలా ఉంచితే, మంచు మనోజ్ (Manchu Manoj) మరి రామ్ చరణ్ పుట్టిన రోజు కి ఏమి చేసాడో తెలుసా. మనోజ్, రామ్ చరణ్ మంచి స్నేహితులు కూడా కదా. అందుకని మనోజ్, తన అక్క లక్ష్మి (Lakshmi Manchu) తో కలిసి ఒక కేక్ తీసుకొని నేరుగా రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళాడు. తీసుకొని వెళ్ళటమే కాకుండా, ఆ కేక్ ని దగ్గరుండి రామ్ చరణ్ తో కట్ చేయించాడు. నా స్వీట్ బ్రదర్, అలాగే గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెపుతూనే, నిన్ను చూస్తుంటే చాల గర్వంగా ఉంది మిత్రమా అని కూడా అన్నాడు. అయితే మూడేళ్ళ క్రితం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఫోటో ఇప్పుడు పెట్టాడు ట్విట్టర్ లో మనోజ్.

ఈమధ్య మంచు మనోజ్ వార్తల్లో వున్నాడు. కొన్ని రోజుల క్రితం తన అన్న విష్ణు (Manchu Vishnu) తో గొడవపడి వీధికెక్కాడు. ఈరోజు ఒక మూవీ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు తన అన్నతో గొడవపడిన విషయం గురించి ఏమి మాట్లాడను అన్నాడు. మళ్ళీ ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కి అతని దగ్గరకి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాడు.

Updated Date - 2023-03-27T14:16:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!