SreeLeela: శ్రీలీల.. లిప్‌లాక్ చేసిన సినిమా ఏంటో తెలుసా

ABN , First Publish Date - 2023-10-28T11:52:06+05:30 IST

ఇటీవ‌ల ఓ ప్రెస్మీట్‌లో శ్రీలీలను ఓ రిపోర్ట‌ర్ తెలుగులో లిప్‌లాక్ చేయాల్సి వ‌స్తే ఏ హీరోతో చేస్తార‌ని అడ‌గ్గా నేను ఎప్ప‌టికీ సినిమాల్లో లిప్‌లాక్ చేయ‌నని చేస్తే నా భ‌ర్త‌తోనే అంటూ ఖ‌రాకండీగా చెప్పింది. అయితే 2019లో క‌న్న‌డ‌లో విడుద‌లైన కిస్ (Kiss) (తెలుగులో ల‌వ్ యూ ఇడియ‌ట్‌) అనే సినిమాలో ఆ చిత్ర హీరో విరాట్‌తో ముద్దు సీన్ల‌లో న‌టించి ఇప్పుడు ఇలా మాట్లాడ‌డం ఎందుక‌ని ప‌లువురు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

SreeLeela: శ్రీలీల.. లిప్‌లాక్ చేసిన సినిమా ఏంటో తెలుసా
sree leela

శ్రీలీల(SreeLeela) ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగుతున్న‌ది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన అతి కొద్ది స‌మ‌యంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ద‌క్కించుకుని తిరుగులేని అధిప‌త్యాన్ని చెలాయిస్తున్న‌ది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా డ‌జ‌ను సినిమాల‌ను లైన్లో పెట్టింది.

స్టార్‌ హీరోలు సైతం త‌న కాల్షీట్ల కోసం వేచి చూసేలా చేస్తు భారీ పారితోష‌కంతో వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళుతున్న‌ది. శ్రీలీల సినిమాలో ఉంది అంటే దానికి ప్రేక్ష‌కులను క్యూ క‌ట్టేలా చేస్తున్న‌ది. ఈ అమ్మ‌డు దెబ్బ‌కు అప్ప‌డివ‌ర‌కు ఫుల్ బీజీగా ఉన్న పూజా హెగ్డే, రష్మిక మంద‌న్న‌, రాశి ఖ‌న్నాలు వేరే ఇండ‌స్ట్రీల వైపు మ‌ళ్లేలా చేసిందంటే శ్రీలీల రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

అమెరికాలో పుట్టి పెరిగిన ఈ ప‌ద‌హార‌ణాల అచ్చ తెలుగమ్మాయి త‌ల్లితో క‌లిసి బెంగ‌ళూరులో నివాసం ఉంటూ త‌న 16వ ఏట‌నే సినిమాలోకి అడుగుపెట్టింది. క‌న్న‌డ‌లో రెండు సినిమాలు చేసి తెలుగులో సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్‌ త‌న‌యుడు రోష‌న్‌కు జోడీగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెళ్లిసందడి చిత్రంతో 2019లో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత 2021లో మాస్ మ‌హారాజ ర‌వితేజకు జ‌తగా చేసిన‌ ధ‌మాకా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో ఇక ఈ ముద్దుగుమ్మకు వెను తిరిగి చూడాల్సిన అవ‌స‌కరం లేకుండా పోయింది.

వ‌రుస‌బెట్టి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna), ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan), మ‌హేశ్‌బాబు (Mahesh Babu), రామ్‌, నితిన్‌(Nithiin), వైష్ణ‌వ్ తేజ్(Panja Vaisshnav Tej) వంటి స్టార్ హీరోల‌ సినిమాల‌లో న‌టించేసి, మ‌రో అర‌డ‌జ‌ను సినిమాల‌ను లైన్లో పెట్టింది. ఇందులో రామ్‌తో (RAmPOthineni) చేసిన‌ స్కంద (Skanda) , బాల‌కృష్ణ‌తో చేసిన భ‌గ‌వంత్ కేస‌రి(Bhagavant Kesari ) విడుద‌ల కాగా మ‌రో నాలుగు సినిమాలు నెల‌కోటి చోప్పున థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.


అయితే ఇప్ప‌టివ‌ర‌కు త‌న న‌ట‌న‌, డ్యాన్సులతో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తున్న ఈ బామ్మ ఆదికేశవ (Aadi keshava) సినిమా లోని లీల‌మ్మో సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొనగా అక్క‌డ ఓ రిపోర్ట‌ర్ తెలుగులో లిప్‌లాక్ చేయాల్సి వ‌స్తే ఏ హీరోతో చేస్తార‌ని అడ‌గ్గా నేను ఎప్ప‌టికీ సినిమాల్లో లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్లు చేయ‌నని చేస్తే నా భ‌ర్త‌తోనే చేస్తానంటూ ఖ‌రాకండీగా చెప్పింది. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్న‌ది.

అయితే ఈ స్టేట్మెంట్‌పై ప‌లువురు నెటిజ‌న్స్ స్పందిస్తూ 2019లో క‌న్న‌డ‌లో విడుద‌లైన కిస్(Kiss) (తెలుగులో ల‌వ్ యూ ఇడియ‌ట్‌) అనే సినిమాలో ఆ చిత్ర హీరో విరాట్‌తో శ్రీలీల (SreeLeela) లిప్‌లాక్ చేసింద‌ని, అప్పుడే ఈ ముద్దు సీన్ల‌లో న‌టించి ఇప్పుడు ఇలా మాట్లాడ‌డం ఎందుకంటున్నారు. అయితే ఈ క్ర‌మంలోశ్రీలీల ఓ సినిమాలో ముద్దు స‌న్నివేశంలో చేసిన విష‌యం చాలా మందికి తెలియ‌దంటూ ఓ వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

Updated Date - 2023-10-28T12:09:19+05:30 IST