Allu Arjun: సాయి పల్లవి 'పుష్ప 2' లో ఉందా... నిజమేనా...

ABN , First Publish Date - 2023-03-08T16:21:36+05:30 IST

ఇంతకీ 'పుష్ప 2' లో సాయి పల్లవి నటిస్తోందా, లేదా అదంతా వట్టిగా వస్తున్న వార్తలేనా తెలుసుకోవాలంటే ఇది చదవండి.

Allu Arjun: సాయి పల్లవి 'పుష్ప 2' లో ఉందా... నిజమేనా...

సాయి పల్లవి (Sai Pallavi) పేరు ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' (Pushpa 2) సినిమాలో వుంది అని చాలామంది ఆమెని వైరల్ చేశారు. ఇంతకీ 'పుష్ప 2' లో ఆమె ఉందా? ఉన్నట్టు అయితే ఎప్పుడో చెప్పేవారు, అలాగే షూటింగ్ లో కూడా పాల్గొనేది కూడాను. కానీ అదే సమయం లో ఆమె ఈ సినిమాలో లేదు, అదంతా వూరికే వట్టి గాసిప్ మాత్రమే అని మరికొందరు అదే సాంఘీక మాధ్యమంలో అంటున్నారు.

saipallavi2.jpg

ఇంతకీ ఆమె 'పుష్ప 2' లో వున్నట్టా, లేనట్టా. అల్లు అర్జున్ పక్కన ఆమె నటిస్తోందా? ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆమె 'పుష్ప 2' లో లేదు. ఎందుకంటే అందులో ఒక కథానాయిక మాత్రమే వుంది, ఆమె రష్మిక మందన్న (Rashmika Mandanna). అంతే ఇంకో కథానాయిక లేదు అని మాత్రం అంటున్నారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ మాత్రం ఉంటుంది, దానికి శ్రీలీల (Sreeleela) కానీ, లేదా పెద్ద పేరున్న ఇంకో నటిని ఎవరిని అయినా తీసుకోవచ్చు అని వినపడుతోంది.

saipallavi.jpg

అంతే కానీ, ఇందులో సాయి పల్లవి మాత్రం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది. సాయి పల్లవి చాలా మంచి నటి, ఒక సినిమా ఫంక్షన్ లో దర్శకుడు సుకుమార్, సాయి పల్లవి ని లేడీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని పిలిచాడు. ఎందుకంటే సుకుమార్, సాయి పల్లవి పేరు చెప్పగానే ఆ హాలులో వున్న ఆమె అభిమానులు సుకుమార్ ని కొన్ని నిముషాలు మాట్లాడకుండా గోల చేసారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది అని ఆమెని లేడీ పవన్ కళ్యాణ్ అని సుకుమార్ అన్నారు. అందువల్ల ఈ 'పుష్ప 2' సినిమాలో సాయి పల్లవి ని తీసుకోవచ్చు అని అభిమానులు అనుకున్నారేమో, కానీ ఆమె ఈ సినిమాలో లేదు.

Updated Date - 2023-03-08T16:24:30+05:30 IST