Siva Nagu: ఆడియో ఫంక్షన్‌కు పిలిస్తే రూ.2లక్షలు అడిగాడు!

ABN , First Publish Date - 2023-06-22T15:56:19+05:30 IST

సీనియర్‌ హీరో సుమన్‌పై (Suman) దర్శకుడు నర్రా శివనాగు SIva Nagu Narra) మండిపడ్డారు. ఆడియో ఫంక్షన్‌కు అతిథిగా ఆహ్వానిస్తే రూ. రెండు లక్షలు డిమాండ్‌ చేశారని(Demand 2 Lakhs), ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘నటరత్నాలు’ (Nataratnalu)చిత్రం ఆడియో వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Siva Nagu:  ఆడియో ఫంక్షన్‌కు పిలిస్తే రూ.2లక్షలు అడిగాడు!

సీనియర్‌ హీరో సుమన్‌పై (Suman) దర్శకుడు నర్రా శివనాగు SIva Nagu Narra) మండిపడ్డారు. ఆడియో ఫంక్షన్‌కు అతిథిగా ఆహ్వానిస్తే రూ. రెండు లక్షలు డిమాండ్‌ చేశారని(Demand 2 Lakhs), ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘నటరత్నాలు’ (Nataratnalu)చిత్రం ఆడియో వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ ఈమఽధ్య కాలంలో చిన్న సినిమాలకు ఆదరణ బావున్నా... సపోర్ట్‌ చేసేవారు కరువయ్యారు. సుమన్‌తో మూడు సినిమాలు చేశా. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆ చనువుతోనే ఇటీవల ఫోన్‌ చేసి ఆడియో ఫంక్షన్‌కు రావాలని కోరాను. ఆయన మా మేనేజర్‌ మీకు టచ్‌లోకి వస్తారు అన్నారు. ఓ పదిరోజులు సాగదీశాక... మేనేజర్‌ టచ్‌లోకి వచ్చారు. ‘ఆయన ఆడియో ఫంక్షన్‌కు రావాలంటే రెండు లక్షలు ఇవ్వలట అండీ’’ అని చెప్పారు. ఏంటీ పరిస్థితి అని ఒక్కసారిగా షాక్‌ అయ్యా. నేను పని చేసిన హీరో నా ఫంక్షన్‌కి రావడానికి డబ్బులు ఇవ్వాలా? డబ్బులిచ్చి.. వేదికపై పొగడాలా? అని చాలా బాధేసింది. ఇది కరెక్ట్‌ కాదని సదరు మేనేజర్‌కు చెప్పా. అయినా సుమన్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌ ఉంది అనిపించింది. ఒకటి మాత్రం చెప్పగలను. ఒక హీరో తయారయ్యాడు అంటూ అది దర్శకుడి వల్లే! హీరోలకు స్టార్‌డమ్‌ వచ్చినా, మంచి గుర్తింపు వచ్చినా అది దర్శకుడితోనే సాధ్యం. సుమన్‌ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో’’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి దీనిపై సుమన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌, అర్జున్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేదిక బుధవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎంఎల్‌ఎ ఎరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దివ్యవాణి, డా. పద్మ, చికోటి ప్రవీణ్‌ తదితరలులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2023-06-22T15:56:19+05:30 IST