Director Mahesh : అందుకు తారలు సిద్ధమే.. అదే నమ్మకంతో!

ABN , First Publish Date - 2023-09-07T10:47:58+05:30 IST

‘‘జీవితంలో పెళ్లి చేసుకోకూడదు.. కానీ తల్లి కావాలి అనే ఆలోచన ఉన్న ఓ యువతి కథతో రూపొందిన చిత్రం ‘ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ‘రారా కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మహేశ్‌.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యు.వి. క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం గురువారం  ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Director Mahesh : అందుకు తారలు సిద్ధమే.. అదే నమ్మకంతో!

‘‘జీవితంలో పెళ్లి చేసుకోకూడదు.. కానీ తల్లి కావాలి అనే ఆలోచన ఉన్న ఓ యువతి కథతో రూపొందిన చిత్రం ‘ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ‘రారా కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మహేశ్‌.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యు.వి. క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం గురువారం  ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘మన నేటివిటీతో రూపొందిన చిత్రం కావడంతో దక్షిణాది భాషల్లో మాత్రమే విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.

"నా సొంతూరు భీమవరం. స్కూల్‌ రోజుల నుంచీ దర్శకుడు కావడమే నా కల. కృష్ణవంశీ, రామ్‌గోపాల్‌ వర్మ, మణిరత్నం నా అభిమాను దర్శకుడు. ‘మొగుడు’ సినిమాకి కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశా. ‘బావ’ సినిమాకీ సహాయ దర్శకుడిగా పనిచేశా. దర్శకుడిగా నేను తీసిన రెండో సినిమాకే అగ్ర కథానాయకుడు చిరంజీవి నుంచి అభినందనలు రావడం నాకు గొప్ప విషయం. ఇప్పటికీ మరువలేని జ్ఞాపకమిది. చిరంజీవి దంపతులతోపాటు ఆ కుటుంబంలో పదిమంది మా సినిమాని చూశారు. వెంటనే చిరంజీవి సర్‌ ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. ఆ సంతోషంలో ఊగిపోయా. నన్ను, నవీన్‌ని ఇంటికి పిలిపించి మాట్లాడటం, వాళ్ల ఇంట్లోనే గంటన్నర సమయం గడపడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఒత్తిడిలో ఉన్న మాకు, విడుదలకి ముందే విజయం అందుకున్న ఫీలింగ్‌ కలిగింది. ఇక నేటితరం తారల విషయానికి వస్తే.. ‘‘కొత్త తరహా కథల్లో నటించడానికి మన తారలు రెడీగా ఉన్నారు. అందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ఉదాహరణ. మాలాంటి దర్శకులు ఇలాంటి స్ర్కిప్ట్‌లు రాస్తున్నామంటే తారల అభిరుచులపై ఉన్న నమ్మకంతోనే. అనుష్కకి కథ చెబుతున్నప్పుడు ఆమె ఎంతో ఆస్వాదిస్తూ విన్నారు. రెండు ప్రధాన పాత్రలపై సాగే సినిమా కావడంతో అందుకు తగ్గట్టే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ అనే పేరు పెట్టాం’’ అని అన్నారు.

Updated Date - 2023-09-07T12:15:35+05:30 IST