సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Director Dasaradh: పవన్‌ ఫ్యాన్స్‌ మెచ్చే రీమేక్‌ ఇది!

ABN, First Publish Date - 2023-01-23T17:37:35+05:30

సంతోషం’ ఫేం దశరథ్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా కోసం పని చేస్తున్నారనే వార్త చాలాకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై దశరథ్‌ స్పందించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సంతోషం’ ఫేం దశరథ్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న సినిమా కోసం పని చేస్తున్నారనే వార్త చాలాకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై దశరథ్‌ స్పందించలేదు. కానీ హరీశ్‌ శంకర్‌ (Harish shankar) మాత్రం క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దశరథ్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘హరీశ్‌ శంకర్‌ తమిళ్‌ ‘తెరి’(Theri Remake) చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. దానికి నేను స్ర్కీన్‌ప్లే రైటర్‌గా పనిచేస్తున్నాను. ఆ సినిమా స్ట్రక్చర్‌ తీసుకుని, చాలా మార్పులు చేశాం. కచ్చితంగా అది పవన్‌కల్యాణ్‌ అభిమానులందరికీ నచ్చేలా హరీశ్‌ డిజైన్‌ చేశారు. అలాగే రవితేజ, సిద్థు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో ఓ సినిమాను రీమేక్‌ చేయమని అడిగిన మాట కూడా నిజమే. కానీ నాకు ఆ జానర్‌ సినిమా డైరెక్ట్‌ చేయడం ఇష్టం లేదు. అందుకే దానికి రైటర్‌గా వర్క్‌ చేస్తున్నా. అంతే కాకుండా హరీశ్‌ ఆధ్వర్యంలోనే ‘ఆహా’ ఓటీటీ కోసం రెండు సిరీస్‌లకు రైటర్‌గా పని చేస్తున్నాను’’ అని అన్నారు.

Updated Date - 2023-01-23T17:39:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!