Director Bobby: ఎండల్లో తిరుగుతున్నాడు.. మాటలు పడుతున్నాడు!

ABN , First Publish Date - 2023-07-31T15:54:56+05:30 IST

బ్రో’ సినిమా సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) పవన్‌ కల్యాణ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బ్రో’ చిత్రంలో టైమ్‌లో గురించి ఎన్నో సార్లు చెప్పారు. టైమ్‌ వాల్యూ గురించి వివరించారు. ప్రస్తుతం మనమంతా స్వార్ధపూరిత లోకంలో బతుకున్నాం. ఎవరూ తమ సమయాన్ని క్షణం కూడా వృథా చేసుకోవడం లేదు.

Director Bobby: ఎండల్లో తిరుగుతున్నాడు.. మాటలు పడుతున్నాడు!

‘బ్రో’ (Bro) సినిమా సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) (KS Ravindra) పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బ్రో’ చిత్రంలో టైమ్‌లో గురించి ఎన్నో సార్లు చెప్పారు. టైమ్‌ వాల్యూ గురించి వివరించారు. ప్రస్తుతం మనమంతా స్వార్ధపూరిత లోకంలో బతుకున్నాం. ఎవరూ తమ సమయాన్ని క్షణం కూడా వృథా చేసుకోవడం లేదు. అలాంటివి పవన్‌కల్యాణ్‌ తన విలువైన సమయాన్ని జనాల కోసం, మన కోసం వెచ్చిస్తున్నారు. దాని వల్ల ఆయనకు జనాల నుంచి ఒక్కరూపాయి రాదు. ప్రత్యేకంగా కిరీటం ఏమీ పెట్టరు. జనాల కోసం ఆయన కేటాయిస్తున్న సమయాన్ని సినిమాకు కేటాయిస్తే కోట్ల సంపాదన ఉంటుంది. కానీ అవన్నీ వదిలేసి ఎలాంటి స్వార్ధం లేకుండా ఆయన విలువైన సమయాన్ని మనకోసం వెచ్చించి ఎండల్లో తిరుగుతున్నాడు. మాటలు పడుతున్నాడు. అందుకే ఆయనకు థ్యాంక్స్‌ చెప్పాలని ఈ కార్యక్రమానికి వచ్చాను. ఇక సినిమా విషయానికొస్తే పవన్‌కల్యాణ్‌గారు టైమ్‌ గురించి ఈ చిత్రంలో బాగా చెప్పారు. త్రివిక్రమ్‌గారి మాటలు, స్ర్కీన్‌ప్లే అద్భుతంగా కుదిరాయి. పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌ దొరికితే మాస్‌ కమర్షియల్‌ సినిమా చేయొచ్చు. ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయం’’ అని అన్నారు. (bro Successmeet)

సముద్రఖని గురించి చెబుతూ ‘‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో విలన్‌గా సముద్రఖని గారిని అనుకున్నాం. లుక్‌, మేకప్‌ టెస్ట్‌ అన్ని అయిపోయాయి. ఓ రోజు ఆయన ఎందుకో ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు అనిపిస్తే దగ్గరకు వెళ్లి అడిగాను. ఆయన పవన్‌కల్యాణ్‌ సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. అభిమానిగా వెంటనే ఆ ప్రాజెక్ట్‌ చాలా ముఖ్యం, చేయండని ఆయనకు చెప్పాను. ఒక నెల సమయం కేటాయించడానికే దర్శకులు ఎంతో ఆలోచిస్తున్నారు. సముద్రఖని 8 నెలలు ఈ సినిమా కోసం ఎదురుచూశారు. అక్కడే ఆయన సక్సెస్‌ తెలిసింది’’ అని అన్నారు.

Updated Date - 2023-07-31T15:54:56+05:30 IST