DimpleHayativsDCP: న్యాయపోరాటం చేస్తానంటున్న డింపుల్ హయతి, పోలీస్ డ్రైవర్ ఏమి చేసాడో చూస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-05-23T12:57:09+05:30 IST

సినీనటి డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ కేసు కొత్తమలుపు తిరిగింది. డింపుల్ న్యాయపోరాటం చేస్తాను అంటోంది. ఎందుకంటే పోలీస్ డ్రైవర్ తన కారు పార్కింగ్ చుట్టూ సిమెంట్ రాళ్లు పెట్టి తన కారు బయటకి పోకుండా చాలా కష్టపడవలసి వస్తోందని ఆమె ఆరోపిస్తోంది

DimpleHayativsDCP: న్యాయపోరాటం చేస్తానంటున్న డింపుల్ హయతి, పోలీస్ డ్రైవర్ ఏమి చేసాడో చూస్తే షాక్ అవుతారు
Dimple Hayati

సినీ నటి డింపుల్ హయతి (DimpleHayati) ఇప్పుడు వార్తల్లో వుంది, అయితే అదేదో సినిమా గురించి కాదు. ఆమె మీద జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ (JubileeHillsPoliceStation) లో కేసు నమోదు చేశారు. జూబిలీ హిల్స్ హుడా ఎన్‌క్లేవ్‌లో ఎస్‌కేఆర్ అపార్ట్‌మెంట్స్‌లో డింపుల్ హ‌యాతి త‌న స్నేహితుడు విక్ట‌ర్ డేవిడ్‌తో ఉంటున్నారు. అదే అపార్టుమెంట్లో ఒక ఐపీఎస్ ఆఫీస‌ర్ కూడా ఉంటున్నాడు. కారు పార్కింగ్ విషయం ఇద్దరికీ కొంచెం తగాదాలు వచ్చిన నేపథ్యంలో డింపుల్ ఆ పోలీస్ అధికారిని కావాలని తన కారుతో గుద్ది పాడుచేసిందని పోలీసుల అభియోగం. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (Traffic DCP RahulHegde) వాహనాన్నీ, డింపుల్ ఢీ కొట్టిందని రాహుల్ హెగ్డే డ్రైవర్ జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాడు.

dimplehayati.jpg

అయితే ఈ కేసులో కొన్ని కొత్త ట్విస్టులు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే డింపుల్ తాను న్యాయ పోరాటం చేస్తాను అని చెప్తోంది. ఎందుకంటే ట్రాఫీస్ డీసీపీ డ్రైవర్, నటి డింపుల్ కారుకు అడ్డంగా సిమెంట్ రాళ్లు పెడుతూ ఉండేవాడని, అందువలన డింపుల్ వాహనం బయటకి తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని, ఆ విషయం డీసీపీ కి బహుశా తెలియకపోవచ్చు అని అంటున్నారు.

dimplehayati1.jpg

ఎందుకంటే పోలీస్ అధికారి వాహనం కాబట్టి, #DimpleHayati వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగానే తీసుకున్నారు, డింపుల్ కి నోటీసు లు ఇచ్చారు, కానీ మరి డీసీపీ డ్రైవర్ సిమెంట్ రాళ్లు డింపుల్ వాహనం దగ్గర పెడితే ఆమె ఎలా తన వాహనాన్ని బయటకి తీయాలని ఆమె సన్నిహితులు అంటున్నారు. అందువలనే డింపుల్ దీని మీద న్యాయపోరాటం చేస్తాను అని అంటోంది అని కూడా చెప్తున్నారు. అందుకనే తన లాయర్ వచ్చాకనే మీడియాతో మాట్లాడుతాను అని అంటోంది.

dimplehayati3.jpg

ఈ కేసు విషయం దింపులే తన ట్విట్టర్ లో ట్వీట్ కూడా పెట్టింది. పవర్ ని మిస్ యూజ్ చేస్తే చేసిన మిస్టేక్స్ కప్పబడవు అని అర్థం వచ్చేట్టు చేసింది. డింపుల్ ఈమధ్యనే విడుదల అయిన 'రామబాణం' (RamaBanam) సినిమాలోనూ, అంతకు ముందు 'ఖిలాడీ' (Khiladi) అనే సినిమాలోనూ కథానాయకురాలిగా నటించింది.

Updated Date - 2023-05-23T13:16:13+05:30 IST