GopiChand-RamBanam: హాట్‌ బ్యూటీ అప్పుడలా... ఇప్పుడిలా..!

ABN , First Publish Date - 2023-03-08T17:26:04+05:30 IST

గోపీచంద్‌, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌ కోసవ మూడో చిత్రంగా ‘రామబాణం’ తెరకెక్కిస్తున్నారు.

GopiChand-RamBanam: హాట్‌ బ్యూటీ అప్పుడలా... ఇప్పుడిలా..!

గోపీచంద్‌(Gopichand), శ్రీవాస్‌ (Sriwass)కాంబినేషన్‌లో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌ కోసం మూడో చిత్రంగా ‘రామబాణం’ (Ramabanam) తెరకెక్కిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభోట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌ సరసన డింపుల్‌ హయాతీ (Dimple hayathi) నటిస్తున్నారు. బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని డింపుల్‌ లుక్‌ను విడుదల చేసి ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆమె భైరవి పాత్రలో నటిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకూ హాట్‌హాట్‌ పాత్రల్లో, ప్రత్యేక గీతాల్లో కనిపించిన డింపుల్‌ ఓ కొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరచింది.

చక్కని సందేశంతోపాటు, కుటుంబ భావోద్వేగాలు మేళవించిన బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు శ్రీవాస్‌. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్‌ కూడా భిన్పమైన పాత్రలో కనిపించనున్నారు.

Untitled-1.jpg

ఈ చిత్రంలో జగపతి బాబు, ఖుష్బు.. గోపీచంద్‌కు అన్నా వదినలుగా నటిస్తున్నారు. భూపతిరాజా ఈ చిత్రానికి కథను అందించిన ఈ చిత్రానికి మధుసూధన్‌ పడమటి మాటలు అందిస్తున్నారు. వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ అందించగా, మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. మే 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-03-08T17:26:10+05:30 IST