Dil Raju: నిర్మాత దిల్ రాజు పరిశ్రమలోని కొందరిపై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-05T10:43:25+05:30 IST

నిర్మాత దిల్ రాజు సంచలన కామెంట్స్ చేసాడు. తెలంగాణ గ్రామాల్లో 'బలగం' సినిమా షో లు వేసుకుంటే తాను ఆపుతున్నాను అని వార్తలు వస్తున్నాయని, అయితే ఆ వార్తలు ప్రచారం చేస్తున్నది ఎవరంటే....

Dil Raju: నిర్మాత దిల్ రాజు పరిశ్రమలోని కొందరిపై సంచలన వ్యాఖ్యలు

నిర్మాత దిల్ రాజు (Dil Raju) ముక్కు సూటి మనిషి. తన మనసులో ఏముందో అది కల్మషం లేకుండా మాట్లాడే వ్యక్తి. అయితే మరి అలంటి దిల్ రాజు ఎందుకు పరిశ్రమలోని వ్యక్తుల మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు అంటే ఇదీ విషయం. దిల్ రాజు 'బలగం' (Balagam) అనే ఒక అద్భుతమైన సినిమా తీసాడు. అది తెలంగాణ పల్లె జీవనానికి అద్దం పెట్టె విధంగా, కుటుంబ బాంధవ్యాలు తెలిపే విధంగా వున్న ఒక బలమైన సినిమా. దీనికి వేణు ఎల్దండి (Venu Yeldandi) దర్శకత్వం చేసాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి రెండు తెలుగు (#Balagam) రాష్ట్రాల్లో ప్రతి రోజు మాట్లాడుకుంటున్నారు.

balagam-team.jpg

అయితే ఈ సినిమా తెలంగాణలోని కొన్ని పల్లె ప్రాంతాల్లో రాత్రి పుట్ట వేసుకొని గ్రామస్థులు అందరూ చూస్తున్నారు. అంతరి ప్రజాదరణ పొందింది ఈ సినిమా. అయితే ఈ సినిమా అక్రమంగా వేస్తున్నారని దిల్ రాజు పోలీస్ లకి ఫిర్యాదు చేసాడని కొంతమంది ఆరోపించారు. నిజానికి దిల్ రాజు పైరసీ మీద ఫిర్యాదు చేస్తే, గ్రామాల్లో ఇలా షోస్ వెయ్యడం (#DilRaju)ఆపాలని ఇచ్చాడని కొందరు పనిగట్టుకొని మరీ ప్రచారం చేశారని అంటున్నారు. ‘‘మంచి సినిమా తీస్తున్నామని, మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో బలగం సినిమాను మొదలు పెట్టాం. కానీ ఈరోజు అదొక చ‌రిత్ర‌. తెలుగు సినిమాలో బ‌ల‌గం ఓ మైలురాయిలా నిల‌బ‌డిపోయేలా ముందుకెళుతోంది," అని చెప్పాడు దిల్ రాజు.

dilraju-balagam.jpg

అలాగే ఇది చిన్నిసినిమా అనుకొని ప్రారంభ‌మైన‌ప్పుడు ఈ సినిమాను మీడియా మిత్రులు ముందుగా చూసి వాళ్ళు ఇచ్చిన అప్రిషియేష‌న్స్‌ను మేం మ‌ర‌చిపోలేక‌పోతున్నాం. ఇప్పుడు సినిమా (#Balagam) విడుద‌లై అయిదు వారాలు అవుతున్న‌ప్ప‌టికీ సినిమా గురించి పరిశ్రమకి చెందిన వల్లీ కాకుండా మినిష్ట‌ర్స్‌, ఎమ్మెల్యేలు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బ‌ల‌గం ఎప్పుడూ నిల‌బ‌డిపోయే ఓ చ‌రిత్ర‌, అని దిల్ రాజు చెప్పాడు.

balagamcinema1.jpg

పల్లెటూళ్లలో షోను ఆపేస్తున్నాడు దిల్ రాజు అన్న వార్తలు అతను కందించాడు. అదంతా కూడా కొంతమంది అతని మీద బురద జల్లాలని పనిగట్టుకొని మరీ ఇలా వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారని దిల్ రాజు చెప్పాడు. "నాకొస్తున్న పేరుని ఓ బ్యాచ్ త‌ట్టుకోలేదు. వెంట‌నే ఏదో స్టార్ట్ చేస్తారు. నేను నిజాయ‌తీగా ఉన్నాను. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు," అని చెప్పాడు దిల్ రాజు.

"నిర్మాత‌గా ఈ సినిమా హ‌క్కుల‌ను నేను ఓటీటీ వాళ్ల‌కి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ల సైడ్ నుంచి మాకు ప్రెష‌ర్ వ‌చ్చింది. వాళ్లు మెయిల్ పెట్టారు. దాని కోసం మా లీగ‌ల్ టీమ్ ఏదో చేసింది కానీ.. ఇది ఆగ‌దు. నేను చెప్పేది ఒక్క‌టే ఈ సినిమా ఎక్క‌డా ఆగ‌దు. ఓపెన్‌గా ఎక్క‌డ ఎలా చూడాల‌నుకుంటే అలా చూడండి. (#Balagam) ఎక్క‌డైనా సినిమా చూడాల‌నుకుంటే మేం కాంటాక్ట్ నెంబ‌ర్ ఇస్తాం. మేం షోస్ అరెంజ్ చేస్తాం," అని చెప్పాడు దిల్ రాజు. ప్రేక్షకులు ఎలాగైనా మంచి సినిమాను చూడాల‌నే 'బ‌ల‌గం'ను రూపొంచాం. మంచి సినిమా చేశామ‌ని అనుకున్నాం కానీ.. గొప్ప సినిమా చేశామ‌ని ఇప్పుడే తెలిసింది. మా ద్వారా కుటుంబాలు క‌లిసి పోతున్నాయి. సోసైటీ మార్పు వ‌స్తుందంటే అంత కంటే గొప్ప ఏముంది. మా జ‌న్మ ధ‌న్య‌మైంది, అని కూడా అన్నాడు.

Updated Date - 2023-04-05T10:48:29+05:30 IST