Dil Raju: ఆ మచ్చ నాకెందుకు.. సక్సెస్‌తో వచ్చిన సమస్య అది.. సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-04-06T18:17:34+05:30 IST

తనకొస్తున్న పేరు, గుర్తింపు చూసి తట్టుకోలేని కొందరు తనపై నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారని, చేయిస్తున్నారని దిల్‌ రాజు అన్నారు.

Dil Raju: ఆ మచ్చ నాకెందుకు.. సక్సెస్‌తో వచ్చిన సమస్య అది.. సంచలన వ్యాఖ్యలు!

తనకొస్తున్న పేరు, గుర్తింపు చూసి తట్టుకోలేని కొందరు తనపై నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారని, చేయిస్తున్నారని దిల్‌ రాజు (Dil raju) అన్నారు. సోషల్‌మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌, నెగెటివిటీపై ఆయన మాట్లాడారు. సాధారణ నిర్మాతగా కెరీర్‌ ప్రారంభించి ప్యాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తే స్థాయికి ఎదిగానంటే దాని వెనుక కష్టం, పట్టుదల, ఎంతోమంది సహకారం ఉన్నాయని, (Dil Raju comments) 20 ఏళ్ల జర్నీలో జయాపజయాలను చూశానని ఆయన చెప్పారు. ‘‘సక్సెస్‌తో సమస్యలు కూడా పెరుగుతాయి. శత్రువులు తయారవుతారు. ఏం మాట్లాడిన అందులో తప్పు పట్టుకోవడానికి చూస్తారు. ఒక మాట అంటే ఇంకోలా అర్థం చేసుకుని విమర్శలు చేస్తారు. ఎన్ని విమర్శలు వచ్చినా నేను పట్టించుకోను. ఏ వేదిక మీద ఏం మాట్లాడినా నన్ను నేను రివ్యూ చేసుకుంటా. పరిస్థితి ఎలా ఉన్నా తప్పు జరగకుండా ఉండటానికి ట్రై చేస్తా. నా వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకోవడం నాకు నచ్చదు. అయితే కొంతకాలంగా కొంతమంది వ్యక్తిగతంగా నన్ను నష్టపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ విషయాలపై మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే వీటిని అసలు పట్టించుకునే వాడిని కాదు. నేను నిర్మాతగానే ఉంటే ఏ సమస్య వచ్చేది కాదు. నేను ప్రతి చోటా ఉంటున్నాను కాబట్టే నాపై ఇంత నెగెటివిటీ తీసుకొచ్చారు. సినిమా రిలీజ్‌ల విషయంలోనూ దిల్‌ రాజు శాసిస్తాడు అంటూ నాపై కామెంట్స్‌ చేస్తారు. అసలు నేనెవరిని శాసించడానికి. మంచి కోసం ఏదన్నా సలహా ఇస్తే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. వాటిపై స్పందించకపోవడం వల్ల తెలిసిన వాళ్లు, బంధువులు కూడా అవన్నీ నిజాలనుకుంటున్నారు. అందుకే ఈ మఽధ్యన నాపై వచ్చే విమర్శలను ఖండిస్తున్నా.

సక్సెస్‌ వెనకే ఉండాలనుకుంటా.. (Dil raju movies with Pawan kalyan, Prabhas)

సక్సెస్‌ వెనుకే పరిగెత్తాలనుకుంటా. ఏదైనా సినిమా ఫెయిల్యూర్‌ వస్తే ఆ శుక్రవారం మాత్రం ఆలోచిస్తాం. అది అక్కడితో అయిపోతుంది. తర్వాత నా దృష్టి అంతా వచ్చే శుక్రవారం మీదే ఉంటుంది. మొదట్లో ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకునే వాడిని కాదు. ఫెయిల్యూర్‌ వచ్చిన తర్వాత మళ్లీ సక్సెస్‌ ఎలా స్పందించాలన్న విషయంపైనే నా దృష్టి ఉంటుంది. భవిష్యత్తులో భారీ చిత్రాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నా. త్వరలో పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌లతో సినిమాలు చేస్తా. రాజమౌళి, సుకుమార్‌ల దర్శకత్వంలో సినిమాలు చేసే ఆలోచన కూడా ఉంది. (Big movies in soon)

Updated Date - 2023-04-06T18:17:36+05:30 IST