Dil Raju: విజయం కోసం ఈసారి పెద్దవాళ్ళను తెచ్చిపెట్టాడు!

ABN , First Publish Date - 2023-08-21T13:29:02+05:30 IST

నిర్మాత దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ రెడ్డి మూడో సినిమా కోసం పెద్ద పెద్ద సాంకేతిక నిపుణలను తీసుకొచ్చాడు. ఈరోజు ఆ సినిమా లాంచ్ అయింది, ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేశారు.

Dil Raju: విజయం కోసం ఈసారి పెద్దవాళ్ళను తెచ్చిపెట్టాడు!
Director Trivikram Srinivas does the muhurat for Ashish Reddy's new film

నిర్మాత దిల్ రాజు (DilRaju) ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ రామ్ చరణ్ (RamCharan), శంకర్ (Shankar) కాంబినేషన్ సినిమాతో పాటు, తన అన్న కొడుకు ఆశిష్ రెడ్డి (AshishReddy) కెరీర్ ని కూడా చూసుకోవాల్సి వుంది. ఆశిష్ రెడ్డి 'రౌడీ బాయ్స్' #RowdyBoys అనే సినిమాతో కెరీర్ ఆరంభించాడు, కానీ ఆ సినిమా అనుకున్నంత ఫలితం మాత్రం ఇవ్వలేదు. తరువాత రెండో సినిమా 'సెల్ఫిష్' #Selfish ఇప్పుడు షూటింగ్ దశలో వుంది. ఆ సినిమాకి విశాల్ కాశి (VishalKasi) దర్శకుడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే ఇప్పుడు మూడో సినిమా కూడా లాంచ్ చేసాడు దిల్ రాజు.

ashishreddy.jpg

ఈ మూడో సినిమాకి మాత్రం చాలా పెద్ద పెద్ద సాంకేతిక నిపుణలని తీసుకొచ్చాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PCSreeram) ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తున్నారు, అలాగే ఆస్కార్ అవార్డు (OscarAwardWinner) విజేత, అగ్ర సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి (MMKeeravani) సంగీతాన్ని సమకూరుస్తున్నారు, ఈ ఇద్దరూ కాకుండా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల (AvinashKolla) ని కూడా తీసుకున్నాడు.

ashishreddy1.jpg

ఇలా ఈ మూడో సినిమాకి ఇంతమంది పెద్ద సాంకేంతిక నిపుణలని తీసుకోవడమే కాకుండా, ఈ సినిమా లాంచ్ చెయ్యడానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) వచ్చారు. ఇలా మూడో సినిమాకి దిల్ రాజు తన అన్న కుమారుడి విజయం కోసం అన్నీ సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు అరుణ్ భీమవరపు (ArunBheemavarapu). కొత్తగా మొదలెట్టిన దిల్ రాజు ప్రొడక్షన్స్ మీద దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-08-21T13:29:02+05:30 IST