Vijay: దిల్ రాజు ఇంటిలో ‘వారసుడు’ సక్సెస్ సెలబ్రేషన్స్

ABN , First Publish Date - 2023-01-22T20:28:03+05:30 IST

‘వారసుడు’ సక్సెస్ సెలబ్రేషన్స్ శనివారం రాత్రి దిల్ రాజు నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో విజయ్, వంశీ పైడిపల్లి, థమన్ లతో పాటు దిల్ రాజు కుటుంబ సభ్యులు సందడి చేశారు.

Vijay: దిల్ రాజు ఇంటిలో ‘వారసుడు’ సక్సెస్ సెలబ్రేషన్స్

కోలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఇళయ దలపతి విజయ్ (Vijay) ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘వారిసు’ (Vaarisu). టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించారు. తెలుగులో ఈ చిత్రం ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా రూ.250కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలన విజయం సాధించింది. మూవీ మంచి విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

‘వారసుడు’ సక్సెస్ సెలబ్రేషన్స్ శనివారం రాత్రి దిల్ రాజు నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో విజయ్, వంశీ పైడిపల్లి, థమన్ లతో పాటు దిల్ రాజు కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్.. దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు చిత్ర బృందంతోను ఫొటోలు దిగారు. ఈ పిక్స్‌లో విజయ్ కొత్త లుక్‌తో కనిపించారు. దీంతో హీరో అభిమానులందరు ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టారు. లోకేశ్ సినిమాలోనిదే ఈ లుక్ అంటూ కామెంట్స్ వర్షం కురిపించారు. పార్టీ సందర్భంగా సినిమాలోనే సూపర్ హిట్‌గా నిలిచిన పాట ‘రంజితమే’ కు దిల్‌రాజు మనవరాలు ఇషిత డ్యాన్స్‌ చేసింది. ఆ పాప డ్యాన్స్‌కు విజయ్‌ ఫిదా అయ్యారు. ఆమెను ఎత్తుకుని ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2023-01-22T20:28:04+05:30 IST